రెండు వందల సంవత్సరాల క్రితం మునిగి పోయిన రెండు నౌకల శిథిలాల క్రింద బంగారు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నట్లు కొలంబియా అధికారులు శుక్రవారం గుర్తించారు. ఆ బంగారం విలువ భారత కరెన్సీలో సుమారు రూ. 1.32 లక్షల కోట్లు ఉంటుందని అధికారుల అంచనా. బంగారంతో పాటు ఇతర వస్తువులు కూడా గుట్టలుగా పడి ఉన్నాయని అధికారులు వెల్లడించారు. 1708లో స్పెయిన్ యుద్ధం సమయంలో ఆ దేశానికి చెందిన శాన్, జోన్ అనే భారీ నౌకలు బ్రిటీష్ దాడుల్లో మునిగిపోయాయి.
ఆ సమయంలో 600 మంది ప్రయాణీకులతో పాటు బంగారు ఆభరణాలు, రత్నాలు కూడా ఉన్నాయి. ఆ నౌక శిథిలాలను 2015లో గుర్తించారు.అప్పటి నుంచి దీనిపై పరిశోధనలు చేస్తున్న కొలంబియా ప్రభుత్వం ఎట్టకేలకు వాటిని గుర్తించింది. కొలంబియా తీరం నుంచి 3100 అడుగుల లోతులో ఈ వాహనం ఉన్నట్లు కొలంబియాకు చెందిన అత్యాధునిక రిమాెెట్ గుర్తించింది. ఈ నౌకలపై పరిశోధనలు జరపనున్నట్లు కొలంబియా అధ్యక్షుడు ప్రకటించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.