Saturday, November 23, 2024

ముచ్చింత‌ల్ లో ముగిసిన స‌హ‌స్రాబ్ది వేడుక‌లు

రంగారెడ్డి జిల్లా ముచ్చింత‌ల్‌లో ఈనెల 2వ‌తేదీన ప్రారంభ‌మైన స‌మ‌తామూర్తి సహ‌స్రాబ్ది వేడుక‌లు ఈరోజు సాయంత్రం ముగిశాయి. ఇవాళ ఉద‌యం ముచ్చింత‌ల్ యాగ‌శాల‌లో మ‌హా పూర్ణాహుతి కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని వీక్షించేందుకు భ‌క్తులు పెద్దఎత్తున త‌ర‌లివ‌చ్చారు. 12 రోజుల పాటు నిర్విఘ్నంగా ల‌క్ష్మీనారాయ‌ణ మ‌హాయాగం కొన‌సాగింది. చివ‌ర‌గా పారా గ్లైడ‌ర్ల‌తో స‌మతామూర్తి విగ్ర‌హంపై పుష్పాభిషేకం నిర్వ‌హించారు. హోమాలు చేసిన రుత్వికుల‌ను చిన‌జీయ‌ర్ స్వామి స‌న్మానించారు. 12 రోజుల పాటు వివిధ హోమాల్లో 5 వేల మంది రుత్వికులు పాల్గొన్నారు.

ప్రతిరోజు అష్టాక్షరీ మంత్ర పఠనం, విష్ణుసహస్ర పారాయణం నిర్వహించారు. యజ్ఞంలోఓ భాగంగా విశ్వక్సేనేష్టి, నారసింహ ఇష్టి, లక్ష్మీనారాయణ ఇష్టి, పరమేష్టి, వైభవేష్టి, హయగ్రీవ ఇష్టి, వైయ్యూహిక ఇష్టి, సుదర్శన ఇష్టి, వైనతే ఇష్టి పూజలను చేశారు. ప్రతిరోజు 114 యాగశాలలో 1035 హోమకుండాల్లో 5 వేల మంది రుత్విజులు భక్తి శ్రద్ధలతో హోమం నిర్వహించారు. ఈ పన్నెండు రోజులు అష్టాక్షరీ మంత్ర పఠనం, చతుర్వేద పారాయణం, నిత్య పూర్ణాహుతి నిర్వహించారు. ఈరోజు రాత్రికి జ‌ర‌గాల్సిన శాంతి క‌ల్యాణం వాయిదా ప‌డింది. వ‌చ్చే శ‌నివారం 108 ఆల‌యాల్లో శాంతి క‌ల్యాణం నిర్వ‌హించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement