Saturday, November 23, 2024

బ్రేకింగ్….కరోనా తో మిల్కా సింగ్ మృతి

కరోనా కారణంగా ఎంతోమంది ప్రముఖులు చనిపోతున్నారు. తాజాగా భారత దిగ్గజ అథ్లెట్ ప్లేయర్ మిల్కా సింగ్ చనిపోయారు. కరోనా తో చికిత్సపొందుతున్న మిల్కాసింగ్ కు శుక్రవారం రాత్రి ఆక్సిజన్ స్థాయి తగ్గడంతో ఐసీయూ కి తరలించారు. అయితే ఫలితం లేకపోయింది. శుక్రవారం రాత్రి 11 గంటల 30 నిమిషాలకు మిల్కా సింగ్ మృతి చెందారు. మిల్కా సింగ్ వయస్సు 91 సంవత్సరాలు. మే 24న కరోనా న్యూమోనియా కారణంగా మొహాలీ ఫోర్టీస్ ఆస్పత్రిలో చేరారు మిల్కా సింగ్. ఆ తర్వాత జూన్ 3న చండీగర్ లోని పిజిఐఎంఆర్ కు తరలించారు.

ఇక గత ఐదు రోజుల క్రితం మిల్కాసింగ్ భార్య నిర్మల్ కూడా కరోనా తో మృతి చెందారు. మిల్కా సింగ్ 1932 నవంబరు 20న జన్మించారు. 1951 లో భారత సైన్యంలో చేరారు. ఆర్మీ నిర్వహించిన పరుగు పందెంలో మిల్కా సింగ్ ఆరో స్థానంలో నిలిచారు. అనంతరం అథ్లెట్ గా మారారు. నాలుగు సార్లు ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం గెలుచుకున్నారు. 1958 కామన్వెల్త్ గేమ్స్ లో పసిడి పతకం ను అందుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement