Friday, November 22, 2024

ఆమెరికాలో పాల దేవ‌త … 1600 లీట‌ర్లు దానం .. వేలాది ప‌సికందుల‌కు జీవం..

అమెరికాలోని ఓరెగాన్‌ రాష్ట్రంలోగల ది ఓలేహా పట్టణానికి చెందిన ఎలిసబెత్‌ అండర్సన్ కు ముగ్గురు పిల్లలు ..! పిల్లలు పెరిగి పెద్దవాళ్లయినా ఆమెలో పాల ధార మాత్రం ఆగిపోలేదు..! నిత్యం ఆమె నుంచి తల్లిపాలు ఓవర్‌ ఫ్లో అవుతూనే ఉన్నాయి..! ఆమెలో ఉన్న ఓ రుగ్మతనే అందుకు కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు..! ఆ రుగ్మత పేరే హైపర్‌ లాక్టేషన్‌ సిండ్రోమ్‌..! ఈ హైపర్‌ లాక్టేషన్‌ సిండ్రోమ్‌ కారణంగానే ఆమెలో నిర్విరామంగా పాల ఉత్పత్తి జరుగుతున్నది…!

అయితే, తనకు ఈ వింత రుగ్మత ఉన్నదని ఆమె ఏనాడు బాధపడలేదు. అంతేగాక ఆమెలో నిరంతరాయంగా ఉత్పత్తి అవుతున్న పాలను కూడా ఆమె వృథా చేయడంలేదు. ఆ పాలను ఆమెరికాలోని ఓ మిల్క్‌ బ్యాంకుకు దానం చేస్తున్నది. 2015 నుంచి 2018 వరకు కేవలం మూడు సంవత్సరాల వ్యవధిలో ఆమె మొత్తం 1,599.68 లీటర్ల తల్లిపాలను దానం చేసింది. అందుకే ఆమెరికాలో ఆమెను ‘పాల దేవత’ అని కూడా పిలుచుకుంటున్నారు. కేవలం మూడేళ్లలో దాదాపు 1600 లీటర్ల పాలను దానం చేసి అత్యధిక తల్లిపాల దాతగా ఆమె గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుల్లో కూడా చోటు సంపాదించింది.

దీనిపై ఎలిసబెత్‌ అండర్సన్ మాట్లాడుతూ,.. తన శరీరంలో ప్రొలాక్టిన్‌ హార్మోన్‌ అవసరానికి మించి విడుదల అవుతున్నదని, ఇదే తనలో హైపర్‌ లాక్టేషన్‌ సిండ్రోమ్‌కు కారణమైందని తెలిపింది. అయితే, తాను దానం చేస్తున్న పాలు అమెరికాలో నెలలు నిండకముందే జన్మించే కొన్ని వేల మంది పిల్లల ప్రాణాలు కాపాడుతుంటం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. వాస్తవానికి ఎలిసబెత్‌ పాలు తాగి వేలాది మంది ప్రీ మెచ్యూర్‌ కిడ్స్‌ ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ విధంగా ఎంతో మంది ఆమెకు రుణపడి ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement