జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల రెచ్చిపోయారు. సరిహద్దులో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. కుల్గాంలో ట్రాఫిక్ నియంత్రణ పనుల్లో ఉన్న పోలీసులపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడడంతో ఓ పోలీసు వీరమరణం చెందారు. మరో ఇద్దరు పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.
మరోవైపు జమ్ముకశ్మీర్‌లోని 14 జిల్లాల్లో 45 ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సోదాలు చేస్తోంది. ఎన్‌ఐఏ, సీఆర్‌పీఎఫ్, జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా నిషేధిత జమాతే ఈ ఇస్లామి సంస్థకు చెందిన సభ్యుల ఇండ్లపై దాడులు నిర్వహించారు. సంస్థపై నిషేధం తర్వాత దాని సభ్యుల కార్యకలాపాలకు సంబంధించిన వివరాలను ఆరా తీస్తున్నారు.