మియామి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో వీల్ చైర్ లో కూర్చుని కనిపించారు ప్రపంచ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ 56 ఏళ్ల టైసన్ వీల్‌చైర్‌లో ,వాకింగ్ స్టిక్ పట్టుకొని కనిపించడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. విజయ్ దేవరకొండ హీరోగా.. తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ లైగర్ లో ఆయన కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం వరకు సినిమా ప్రమోషన్స్‌లో బిజి బిజీగా గడిపిన మైక్ టైసన్.. తాజాగా వీల్‌చైర్‌లో కూర్చొని కదలలేని పరిస్థితిలో కనిపించిన పోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కాగా మైక్ టైసన్ అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు కొంత మంది ఫ్యాన్స్ సెల్ఫీల కోసం ఎగబడటం విమర్షలకు దారి తీస్తోంది.
అయితే అసలు మైక్ టైసన్ కు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో అని అభిమానులు ఆరా తీయగా అసలు విషయం బయట పడింది. టైసన్ గతకొంతకాలంగా వెన్నునొప్పి, సయాటికాతో బాధపడుతున్నట్లు తెలిసింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మైక్ టైసన్ ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.. ఎక్స్పైరీ డేట్‌కు దగ్గర పడుతున్నానని చెప్పిన అందరిని ఆశ్చర్యపరిచారు. ఇక ప్రస్తుతం ఆయన మాటల గురించి జనం మాట్లాడుకుంటున్నారు. మైక్ టైసన్ కోసం.. ఇంటర్నేషనల్ ఫేమస్ డాక్టర్లు ఆయనకు ట్రీట్ మెంట్ చేస్తున్నట్టు సమాచారం. అయితే వారు టైసన్‌ను వీల్ చైర్ వాడాలని సూచించారట. ఈ విషయం తెలసుకున్న అభిమానులు ఆందోళన చెందుతున్నారు.