Tuesday, November 19, 2024

లాక్‌డౌన్ భయంతో మళ్లీ సొంతూళ్లకు

కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ గత ఏడాది స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో నగరాల్లో ఉండే వలస కార్మికులలో భయాందోళన మొదలైంది. ఇప్పటికే పలు రాష్ట్రాలలో నైట్ కర్ఫ్యూ పెట్టడంతో వలస కూలీల్లో దడ మరింత ఎక్కువైంది. దీంతో ముంబైలో గత ఏడాది నాటి పరిస్థితులు పునరావృతం అవుతున్నాయి. అక్కడ కేసులు పెరుగుతుండటంతో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారనే భయంతో కార్మికులు తమ సొంతూళ్లకు వెళ్తున్నారు. గత 3 రోజుల్లోనే ఏకంగా 4.5 లక్షల మంది వలస కూలీలు తమ సొంతూళ్లకు వెళ్లిపోయారు. వలస కార్మికులతో అన్ని రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ముంబై నుంచి బీహార్, యూపీ, జార్ఖండ్ వెళ్లే రైళ్ల బెర్తులన్నీ వలస కార్మికులతో నిండిపోతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement