Friday, November 22, 2024

కేంద్ర బడ్జెట్ పై మిడిల్ క్లాస్ గంపెడాశ‌లు..

న్యూఢిల్లి: మన దేశంలో మధ్యతరగి పరిగణలోకి తీసు కోదగిన శక్తివంతమైన వర్గం. ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు ఈ వర్గం కిందకు వస్తారు. ఒక అంచనా ప్రకారం రా నున్న 25 సంవత్సరాల్లో మధ్య తరగతి వారి సంఖ్య రెట్టిం పు కానుంది. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం మధ్య తరగతి వారిని, వారి సామర్ధ్యాన్ని నిరాశపరుస్తున్నాయ ని కొంతమంది నిపుణులు వాదిస్తున్నారు. మధ్యతరగతి ప్రజలకు రాబడి తక్కువగా ఉంటోంది. అదే సమయం లో పన్నుల భారం పెరుగుతోంది. చాలా మంది మధ్య తరగతి వారు సాధ్యమయ్యే ఏదైనా సర్ధుబాటు చేయా లని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇటీవల ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా తాను మధ్య తరగతి నుంచే వచ్చానని వారి ఇబ్బందులు తనకు తెలుసన్నారు. మెడీ ప్రభు త్వం మధ్యతరగతి వారిపై ఎలాంటి అదనపు భారం వేయలేదన్నా రు. మధ్యతరగతి భారీగా పెరిగిందని, వీరికి ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తుందని ఆర్ధి క మంత్రి హామీ ఇచ్చారు. ప్రభుత్వం మధ్యతరగతి వారి సమస్యలను గుర్తిం చిందని, వారికి కావాల్సింది చేయ డానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

మధ్యతరగతికి తగ్గుతున్న ఆదాయాలు
దేశంలో మధ్యతరగతి ప్రజల ఆదాయాలు తగ్గిపోతు న్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుతున్నందున వారి కొనుగోలు శక్తి తగ్గిపోతున్నది. 2022లో కుటుంబాల పొదుపు ఐదేళ్ల కని ష్టానికి పడిపోయింది. 2020-21లో కుంటుబాల స్థూల ఆర్ధిక పొదుపులు 2020-21లో 15.9శాతంతో పోల్చితే 2022-23 ఆర్ధిక సంవత్సరంలో ఇది 10.8 శాతానికి పడిపోయింది. గ త మూడు ఆర్ధిక సంవత్సరాల్లో ఇది 12 శాతంగా ఉం ది. పొదుపు మొత్తాలు పడిపోవడం వల్ల దిగువ మ ధ్యతరగతి వారికి మరింత కిందకు నెట్టివేసే అవ కాశం ఉంది. ప్రభుత్వం బడ్జెట్‌లో కొన్ని చర్య లు తీసుకోవడం ద్వారా మిడిల్‌ క్లాస్‌ ఆదా యాలు పెరిగేలా చేయవచ్చని ప్రముఖ ఆర్ధిక నిపుణులు ప్రొఫెసర్‌ అరుణ్‌ కుమార్‌ చెప్పారు. ప్రధానంగా ప్రభుత్వం ఆదా యాన్ని పెంచే చర్యలతో పాటు, ఉద్యోగా లు కల్పించాల్సి ఉందన్నారు. మిడిల్‌ క్లా స్‌కు సహాయం చేయడానికి అసంఘటిత రంగంలో డిమాండ్‌ పెంచాలని ఆయన సూచించారు. దీని వల్ల మందగిస్తున్న వ్యవ స్థీకృత రంగం మళ్లిd వేగంగా విస్తరించడం ప్రారంభించవచ్చు. అంతర్గత డిమాండ్‌ పెంచడం ద్వారా మందగమానాన్ని అధిగమించేందుకు చర్యలు తీసు కోవాల్సిన అవసరం ఉందని అరుణ్‌ కుమార్‌ చెప్పారు. జీ ఎస్టీ అంసంఘటిత రంగాన్ని దెబ్బతీయడం వల్ల కొవిడ్‌కు ముందే దీని వృద్ధి మందగించిందని చెప్పారు. జీఎస్టీ లాస్ట్‌ పాయింట్‌ అయినందున, ఇది ఉత్పత్తి, పంపిణీ పాయింట్స్‌ వద్ద కాకుండా ఎండ్‌ పాయింట్‌ వద్ద మాత్రమే కలె క్ట్‌ చేసుకునేలా సంస్కరించాలని ఆయన సూచించారు. దీని వల్ల అ సంఘటిత రంగం నుంచి డిమాండ్‌ను సంఘటిత రంగానికి మార్చడాన్ని ఇది పునరుద్ధరించడానికి సహాయపడుతుం దని చెప్పారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు భారీ గా పెంచడాలని, దీనితో పాటు పట్టణ ప్రాంత ఉపాధి హామీ పథకం తీసుకురావాలని కోరారు. ప్రభుత్వం 2020 నుంచి మూలధన వ్యయాన్ని పెంచుతూ వస్తోందని ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్‌ చెప్పారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో 35 శాతం పెంచి ఈ వ్యయానని 7.5 లక్షల కోట్లకు చేర్చినట్లు తెలిపారు.
ఈ విషయంలో ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురా మ రాజన్‌ భిన్నాభిప్రాయం కలిగి ఉన్నారు. ఇది పెద్ద సమస్య అని ఆయన చెప్పారు. ఉన్నత మధ్యతరగి వారు కొవిడ్‌ మ హమ్మారి సమయంలోనూ పని చేయగలిగినందున వారికి ఆదాయాలు వచ్చాయని, పేదలు, కార్మికులు పని చేసేందుకు కర్మాగారాలు మూసివేసి ఉన్నందున కొవిడ్‌ ప్రభావం వీరిపైనే ఎక్కువ ఉందన్నారు. కొవిడ్‌ సమయంలో ఈ విభజన చాలా పెరిగిందని రఘురామ రాజన్‌ చెప్పారు. పేదలకు రేషన్‌ అం దుతుందని, వారికి చా లా వరకు అన్ని లభించాయని చెప్పారు. ధనవంతులు కొవి డ్‌ మూలంగా ఎలాంటి ఇబ్బందులు పడలేదు. మధ్యలో ఉ న్న మధ్యతరగతి చాలా నష్టపోవాల్సి వచ్చింద న్నారు. వీరి లో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఈ వర్గానికి అ ప్పులు పెరిగాయని, వీరికి తప్పక సహాయం కావాలని రఘురామ రాజన్‌ స్పష్టం చేశారు. దేశంలో మధ్యతరగ తి వినియోగ సామర్ధ్యం పెరిగితేనే అభివృద్ధి చెందిన ఆర్ధి క వ్యవస్థగా మారుతుందని చాలా మంది ఆర్ధిక నిపు ణుల చాలా కాలంగా స్పష్టం చేస్తున్నారు. ఆర్ధిక మాం ద్యం భయాలతో ప్రపంచ వ్యాప్తంగా పెద్ద టెక్‌ కంపె నీలు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. పెట్టుబ డిదారులు జాగ్రత్త పడుతున్నందున మూల ధనం కూడా తగినంత అందుబాటులో ఉండే అవకా శం తక్కువని నిపుణులు అంచనా వేస్తున్నారు. విని యోగ వస్తువుల కంపెనీల అంచనా ప్రకారం ప్ర స్తుతం మన దేశంలోని గ్రామీణ డిమాండ్‌ మం దగించిందని నివేదికలు స్పష్టం చేస్తు న్నాయి. మన దేశ జీడీపీ సైతం 6.3 శాతా నికి తగ్గింది. ఇది 2024లో 5.2 శాతం మాత్రమే ఉండొ చ్చని అంచనా. ఈ ప రిస్థితుల నేపథ్యంలో ఈ సారి బడ్జెట్‌లో మధ్య తరగతికి ఉపశ మన చర్యలు తీసుకోవాల్సిన అవసర ం ఉందని, వారి కొనుగోలు శక్తి పెంచ డంతో పాటు, మూల ధనవ్యయా న్ని పెంచడం ద్వారా ఉపాధి అ వ కాశాలు పెరుగుతాయన్నా రు.

Advertisement

తాజా వార్తలు

Advertisement