టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఛైర్మన్‌గా తెలుగు వ్యక్తి సత్య నాదెళ్ల ఎంపికయ్యారు. ఇప్పటికే కంపెనీ సీఈవోగా ఉన్న ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించింది యాజమాన్యం. బోర్డు ఛైర్మన్ పదవికి స్వతంత్ర డైరెక్టర్లు.. బుధవారం నాదెళ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ప్రకటించింది. జాన్ డబ్ల్యూ థామ్సన్‌ను స్వతంత్ర డైరెక్టర్‌గా నియమించారు. 2014 నుంచి సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవోగా పనిచేస్తున్నారు. కాగా భారత సంతతికి చెందిన తెలుగు వ్యక్తి అయిన నాదెళ్ల మరో మెట్టు ఎక్కడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement