Saturday, November 23, 2024

ఇంట‌ర్నెట్ ఎక్స్‌ప్లోర‌ర్ బ్రౌజ‌ర్ వాడేవారికి ముఖ్య గమనిక

మీరు ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ బ్రౌజర్ వాడుతున్నారా? అయితే వచ్చే ఏడాది నుంచి ఈ బ్రౌజర్ పనిచేయదు. 25 సంవ‌త్స‌రాలుగా ఉన్న ఇంట‌ర్నెట్ ఎక్స్‌ప్లోర‌ర్ బ్రౌజ‌ర్‌ను జూన్ 15, 2022 నుంచి క్లోజ్ చేస్తున్న‌ట్లు మాతృసంస్థ మైక్రోసాఫ్ట్ ప్ర‌క‌టించింది. ఇంట‌ర్నెట్ యూజ‌ర్స్ అంతా ఇంట‌ర్నెట్ ఎక్స్‌ప్లోర‌ర్ కు బ‌దులుగా… గూగుల్ క్రోమ్‌, యాపిల్ స‌ఫారీకి అల‌వాటు ప‌డ‌డంతో ఇంట‌ర్నెట్ ఎక్స్‌ప్లోర‌ర్‌కు మార్కెట్ త‌గ్గింది. దీంతో బ్రౌజ‌ర్‌ను క్లోజ్ చేయాల‌ని మైక్రోసాఫ్ట్ నిర్ణ‌యించింది.

కానీ ఆ బ్రౌజ‌ర్ ఆధారంగా ప‌నిచేసే వెబ్‌సైట్లు, అప్లికేష‌న్లు మాత్రం మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజ‌ర్ సహాయంతో పనిచేస్తాయని మైక్రోసాఫ్ట్ ప్ర‌క‌టించింది. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ చాలా వేగంగా బ్రౌజ్ చేస్తుంద‌ని, సేఫ్ గా బ్రౌజ్ చేసుకోవ‌చ్చ‌ని మైక్రోసాఫ్ట్ వెల్ల‌డించింది. సంస్థ ఇంట‌ర్నెట్ ఎక్స్‌ప్లోర‌ర్ ను క్లోజ్ చేస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించ‌గానే సోష‌ల్ మీడియాలో కామెంట్లు జోరందుకున్నాయి. ప్రస్తుతం ఉన్న మార్కెట్‌లో గూగుల్‌ క్రోమ్ బ్రౌజ‌ర్‌ను 65 శాతం మంది వినియోగిస్తుండ‌గా‌, యాపిల్ స‌ఫారీ బ్రౌజ‌ర్‌ను 19 శాతం మంది వినియోగిస్తున్నారు. ఫైర్ ఫాక్స్‌ను 3.59శాతం, ఎడ్జ్ బ్రౌజ‌ర్‌ను 3.39శాతం మంది వినియోగిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement