Monday, November 18, 2024

భారత్‌లో ఆస్ట్రేలియన్లు బిక్కుబిక్కుమంటూన్నారు: మాజీ క్రికెటర్ మైకేల్ స్లేటర్ ఫైర్

నిబంధనలు ఉల్లంఘించి భారత్ నుంచి ఎవరైనా స్వదేశానికి వస్తే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని, జైలులో వేసి శిక్షిస్తామని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.  ప్రధాని ఆదేశాలపై ఇటీవల మండిపడిన ఆ దేశ మాజీ క్రికెటర్ మైకేల్ స్లేటర్ మరోమారు విరుచుకుపడ్డాడు. మహమ్మారితో పోరాడుతున్న భారతీయులకు సంఘీభావం తెలిపిన స్లేటర్ వారికోసం తాను ప్రార్థిస్తానన్నాడు.

ఇండియాలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, ఇక్కడున్న ప్రతి ఆస్ట్రేలియా పౌరుడు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాడని ఓ ట్వీట్‌లో ఆవేదన వ్యక్తం చేశాడు. తన మాటలు నమ్మకుంటే ప్రైవేట్ జెట్ వేసుకుని ఇండియా వచ్చి ఇక్కడి వీధుల్లో పడి ఉన్న శవాలను చూాడాలంటూ స్లేటర్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరాడు. కాగా, ఐపీఎల్‌లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న స్లేటర్ ఐపీఎల్ రద్దుతో స్వదేశానికి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాడు. అలాగే ఐపీఎల్‌లో వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆసీస్ క్రికెటర్లు కూడా ఇక్కడే చిక్కుకుపోయి భయంభయంగా గడుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement