ఐపీఎల్ 2024 లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్ – రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో.. రాజస్థాన్ బౌలర్లు చెలరేగారు. దీంతో, టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. (125/9) తక్కువ పరుగులకే పరిమితమైంది. సీజన్‌లో తొలిసారి ప్రథ్యర్ధి పిచ్‌పై ఆడుతున్న రాజస్థాన్ బౌలర్లు నిప్పులు చెరిగారు.
రాజస్థాన్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్, నంద్రె బర్గర్‌లు విజృంభించడంతో, ముంబై ఇండియన్స్ జట్టు 20 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. కాగా, ట్రెంట్ బౌల్ట్ (3/22), యుజ్వేంద్ర చాహల్ మూడు వికెట్లు (3/11) తీయగా.. నంద్రె బర్గర్ (2/32) రెండు, అవేష్ ఖాన్ ఒక్క (1/21) వికెట్ దక్కంచుకున్నాడు.
రోహిత్ శర్మ, నమన్ ధీర్, డెవాల్డ్ బ్రెవిస్ ముగ్గురూ బౌల్ట్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగగా.. ఓపెనింగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (16) పరుగులకే పెవిలియన్ చేరాడు. అయితే ముంబై మిడిలార్డర్ బ్యాటర్లు తిలక్ వర్మ(32), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (34) నిలకడగా ఆడి.. ముంబై జట్టు స్కోర్‌బోర్డు పై పరుగులు పెంచారు. మొత్తాని ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. దీంతో 126 పరుగల టార్గెట్‌తో రాజస్థాన్ ఛేదనకు దిగనుంది.