ఐపీఎల్లో భాగంగా నేడు (గురువారం) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. కాగా ఈ కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఇక ముంబై హోం గ్రౌండ్ వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ మరికొద్ది సేపట్లో ప్రారంభంకానుంది.
జట్ల వివరాలు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు :
విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (c), రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్వెల్, విల్ జాక్స్, దినేష్ కార్తీక్ (WK), మహిపాల్ లోమ్రోర్, రీస్ టోప్లీ, మహమ్మద్ సిరాజ్, వైషాక్ విజయ్‌కుమార్, ఆకాష్ దీప్
ముంబై ఇండియన్స్ :
రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (WK), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (c), టిమ్ డేవిడ్, మొహమ్మద్ నబీ, రొమారియో షెపర్డ్, శ్రేయాస్ గోపాల్, గెరాల్డ్ కోయెట్జీ, జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ మధ్వల్
ఈ సీజన్లో ఇరు జట్లు పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరుస్తున్నాయి. రెండు జట్లు ఇప్పటి వరకు కేవలం ఒక మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించాయి. దీంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకంగా మారింది. అయితే, కిందటి మ్యాచ్‌లో ఢిల్లీపై గెలచిన ముంబై.. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకోవాలని భావిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇరు జట్లు చాలా బలంగా ఉన్నాయి. అయితే సమష్ఠిగా రానించడంలో విఫలమవుతుండడంతో వరుస ఓటములు తప్పడం లేదు.