ఐపీఎల్ 2024లో భాగంగా నేడు జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ – లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకుని.. లక్నో జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఇక ముంబై హోం గ్రౌండ్ వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ మరికొద్ది సేటప్లో ప్రారంభంకానుంది.
జట్ల వివరాలు :
లక్నో సూపర్ జెయింట్స్ :
లోకేశ్ రాహుల్ (c & wk), దేవదత్ పడిక్కల్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, అర్షద్ ఖాన్, మాట్ హెన్రీ, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్.
ముంబై ఇండియన్స్ :
ఇషాన్ కిషన్ (WK), నమన్ ధీర్, డెవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, నెహాల్ వధేరా, హార్దిక్ పాండ్యా (c), రొమారియో షెపర్డ్, అన్షుల్ కాంబోజ్, పీయూష్ చావ్లా, నువాన్ తుషార, అర్జున్ టెండూల్కర్.
ఆఖరి పోరు..
ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టు 13 మ్యాచ్‌ల్లో 4 విజయాలు మాత్రమే సాధించి 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ఇక ఈ సీజన్‌లోని ఆఖరి మ్యాచ్‌లో అయినా బాగా రాణించాలని కెప్టెన్ హార్దిక్ పాండ్యా కోరుకుంటున్నాడు. ప్రస్తుత సీజన్ ముంబయి జట్టు పేలవమైన ప్రదర్శనతో ఇబ్బంది పడుతోంది. స్టార్ ఆటగాళ్లు కూడా బ్యాట్‌తో నిరాశపరిచారు. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా చాలా మ్యాచ్‌ల్లో ఫ్లాప్ అయ్యాడు. ఇటువంటి పరిస్థితిలో ముంబై ఇండియన్స్ జట్టు ఏకమై సీజన్‌ను ముగించడం సవాలుగా ఉంటుంది.
మరోవైపు, లక్నో సూపర్ జెయింట్స్ 13 మ్యాచ్‌లలో 6 విజయాలతో 12 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. ఆడిన గత మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. దీంతో ప్లేఆఫ్ ఆశలకు పెద్ద దెబ్బ తగిలింది. ఒకప్పుడు ఆ జట్టు టాప్ 4కి గట్టి పోటీదారు అని అనిపించినా ఇప్పుడు అందుకు అవకాశం చాలా తక్కువ. టాప్ ఆర్డర్‌లో కెప్టెన్ కేఎల్ రాహుల్, క్వింటన్ డి కాక్ నిరాశపరిచారు. అదే సమయంలో, మిడిల్ ఆర్డర్ నుంచి గణనీయమైన సహకారం నిలకడగా కనిపించలేదు. ఇటీవలి మ్యాచ్‌ల్లో బౌలింగ్ కూడా చాలా సాధారణంగా ఉంది. ఇటువంటి పరిస్థితిలో లక్నో కూడా గెలవడానికి తన స్థాయిని పెంచుకోవాలి.