ఐపీఎల్ 2024లో భాగంగా నేడు (శుక్రవారం) జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనుంది. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకుని కోల్‌కతా జట్టును బ్యాటింగ్ ఆహ్వానించింది. ఇక ముంబై హోం గ్రౌండ్ వాంఖడే క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈమ్యాచ్ మరికొద్ది సేపట్లో ప్రారంభంకానుంది.
జట్ల వివరాలు :
కోల్‌కతా నైట్ రైడర్స్ : ఫిల్ సాల్ట్ (WK), సునీల్ నరైన్, శ్రేయాస్ అయ్యర్ (c), వెంకటేష్ అయ్యర్, అంగ్క్రిష్ రఘువంశీ, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి.
ముంబై ఇండియన్స్ : ఇషాన్ కిషన్ (WK), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నమన్ ధీర్, నెహాల్ వధేరా, హార్దిక్ పాండ్యా (c), జస్ప్రీత్ బుమ్రా, గెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా, నువాన్ తుషార.
ఇంపాక్ట్ ప్లేయర్స్ :
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, రొమారియో షెపర్డ్, షామ్స్ ములానీ, శివాలిక్ శర్మ
కోల్‌కతా నైట్ రైడర్స్: అనుకుల్ రాయ్, శ్రీకర్ భరత్, చేతన్ సకారియా, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, మనీష్ పాండే
సమరోత్సాహంతో సిద్ధమైన నైట్‌రైడర్స్…
ముంబై ఇండియన్స్‌తో జరిగే పోరుకు కోల్‌కతా నైట్‌రైడర్స్ సమరోత్సాహంతో సిద్ధమైంది. వరుస విజయాలతో జోరుమీదున్న కోల్‌కతా ఈ మ్యాచ్‌లోనూ గెలిచి ప్లేఆఫ్ అవకాశాలను మరింత మెరుగు పరుచుకోవాలని భావిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో నైట్‌రైడర్స్ సమతూకంగా కనిపిస్తోంది. మరోవైపు హార్ధిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ జట్టు వరుస మ్యాచ్‌లలో ఓడి ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. దీంతో కనీసం ఈ మ్యాచ్‌లోనైనా మెరుగైన ప్రదర్శన చేయాలని ముంబై భావిస్తోంది. అయితే బలమైన కోల్‌కతాతో పోరు ముంబైకి సవాల్ వంటిదేనని చెప్పాలి.