ఢిల్లీ వేదికగా ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. స్టబ్స్ ను పక్కన పెట్టిన ముంబై అతడి స్థానంలో రైలీ మెరిడిత్ ను తీసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా మార్పులు చేసింది. వరుసగా విఫలం అవుతున్న రైలీ రోసో స్థానంలో ముస్తఫిజుర్ ను తీసుకుంది. అదే విధంగా ఖలీల్ అహ్మద్ స్థానంలో యశ్ ధుల్ జట్టులోకి వచ్చాడు.
ఇక ఇప్పటివరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ లో ఇంకా ఖాతా తెరవతని టీమ్స్ గా ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ఉ న్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ ఓడితే.. ముంబై ఇండియన్స్ ఆడిన రెండింటిలో ఓడింది. మరి ఈ మ్యాచ్ ఏ టీమ్ మెదట కాతా ఓపెన్ చేస్తోందో చూడాలి.
ముంబై ఇండియన్స్:
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, కెమరూన్ గ్రీన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, వదేరా, సోకీన్, అర్షద్, బెహ్రండార్ఫ్, పియూశ్, మెరిడిత్
ఇంపాక్ట్ ప్లేయర్స్ : టిమ్ డేవిడ్, స్టబ్స్, కార్తికేయ, అర్జున్ టెండూల్కర్, రమన్ దీప్
ఢిల్లీ క్యాపిటల్స్:
డేవిడ్ వార్నర్ (కెప్టెన్), పృథ్వీ షా, మనీశ్ పాండే, యశ్ ధూల్, రోవ్ మన్ పావెల్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, పోరెల్, కుల్దీప్ యాదవ్, నోకియా , ముస్తఫిజుర్ రెహ్మాన్
ఇంపాక్ట్ ప్లేయర్స్ : ముకేశ్ కుమార్, అమన్, సర్ఫరాజ్, దూబే, ఇషాంత్