Saturday, November 23, 2024

MI vs CSK | టాస్ గెలిచిన ముంబ‌యి.. చెన్నైదే ఫస్ట్ బ్యాటింగ్

ఈ ఐపీఎల్ లోనే హై ఓల్టేజ్‌ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. నేడు అయిదుసార్లు ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్ తో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌కింగ్స్ తలపడనుంది. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై.. చెన్నై జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఇక‌ ముంబైలోని వాంఖడేలో జరుగుఉన్న ఈమ్యాచ్ మరికొద్ది సేపట్లో ప్రారంభంకానుంది.

జ‌ట్ల వివ‌రాలు :

చెన్నై సూపర్ కింగ్స్ :

రుతురాజ్ గైక్వాడ్ (c), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, ఎంఎస్ ధోని (WK), శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రహ్మాన్.

ముంబై ఇండియన్స్ :

రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (WK), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (c), టిమ్ డేవిడ్, మహ్మద్ నబీ, రొమారియో షెపర్డ్, శ్రేయాస్ గోపాల్, ఆకాష్ మధ్వల్, జస్ప్రీత్ బుమ్రా, గెరాల్డ్ కోయెట్జీ.

- Advertisement -

కాగా, ఈ మ్యాచ్‌లో మొదటిసారి ధోనీ… కెప్టెన్‌గా కాకుండా కేవలం ఆటగాడిగా బరిలోకి దిగుతున్నాడు. 42 ఏళ్ల వయసులో కీపింగ్‌లో అదరగొడుతున్న ధోనీ… బ్యాట్‌తో కూడా రాణిస్తున్నాడు. ఇక ఈ సీజన్‌లో రెండు పరాజయాలను చవిచూసిన చెన్నై… ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్లే ఆఫ్‌ దిశగా మరో అడుగు ముందుకు వేయాలని పట్టుదలగా ఉంది.

కెప్టెన్ రుతురాజ్‌ గైక్వాడ్‌, రహానే, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ధోనీలతో చెన్నై బ్యాటింగ్‌ చాలా దుర్భేద్యంగా ఉంది. శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రెహ్మాన్, జడేజా, రచిన్‌ రవీంద్రలతో బౌలింగ్‌ కూడా పర్వాలేదనిపిస్తోంది.

ఆత్మ విశ్వాసంతో ముంబై..

హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ జట్టు ఈ ఐపీఎల్‌ను పరాజయాలతో ప్రారంభించిన… వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి గాడినపడింది. సూర్యకుమార్‌ యాదవ్‌ వచ్చిన తర్వాత ముంబై బ్యాటింగ్‌ చాలా బలంగా మారింది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సూర్య విధ్వంసమే సృష్టించాడు. ఇక ఇషాన్ కిషన్, రోహిత్, పాండ్యా లతో ముంబై బ్యాటింగ్‌ కూడా బలంగానే ఉంది. ముంబై జట్టు బౌలింగ్ భారాన్ని పేస్‌ స్టార్‌ బుమ్రా ఒక్కడే మోస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement