ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ ఖాతా తెరిచింది. సీజన్‌లో తొలి విజయం సాధించింది. నేడు హోమ్ గ్రౌండ్ వాంఖడే వేదికగా జరిగిన జరిగిన మ్యాచ్‌లో ఢిల్లో క్యాపిటల్స్‌పై 29 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై…. విధ్వంసకర బ్యాటింగ్‌తో రెచ్చిపోయింది. రోహిత్ శర్మ(49), ఇషాన్ కిషన్(42) చెలరేగారు.. టిమ్ డేవిడ్ (45 నాటౌట్), రొమారియో షెపర్డ్(39 నాటౌట్)లు ఆఖరి ఓవర్లో చితకబాదారు. దాంతో ముంబై 5 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది.
అయితే భారీ ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పోరాడింది. ఓపెనర్ పృథ్వీ షా (65)హాఫ్ సెంచరీ బాదాడు. మరో ఎండ్ లో అభిషేక్ పొరెల్ (41) పరుగులు సాధించాడు. వీరి తరువాత వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్ 71 (నాటౌట్)తో విజృంభించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ల 8 నష్టానిక 205 పరుగులు చేయగలిగింది. ఇక ముంబై బౌలర్లలో రొమారియో షెపర్డ్ ఒక్క తీయగా.. గెరాల్డ్ కోయెట్జీ నాలుగు, జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు దక్కించుకున్నారు.