ఎంజీ మోటార్స్ పెట్టుబడుల విషయమై కీలక ప్రకటన చేసింది. తన రెండో తయారీ యూనిట్‌లో రూ.4,000 కోట్ల పెట్టుబడు పెట్టాలని యోచిస్తున్నట్టు తెలిపింది. దీని కోసం గుజరాత్‌తో పాటు అనేక రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నామని వివరించింది. అయితే గుజరాత్‌లోనే రెండో ప్లాంట్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఎంజీ మోటార్స్ ఉన్నట్టు ఆ కంపెనీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే ఆలోచనలో భాగంగా.. రెండో యూనిట్ ప్రారంభించాలని నిర్ణయించింది. గుజరాత్‌లోని హలోల్‌లో 2023 నాటికి.. 1.25లక్షల యూనిట్లు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రెండో ప్లాంట్ ద్వారా మరో 1.75 లక్షల యూనిట్లు ఉత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.
మొత్తంగా 3లక్షల యూనిట్లు వార్షిక ప్రాతిపదికన బయటికి తీసుకురావాలని, దీనికి రానున్న రెండేళ్లు లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తున్నది. ఎంజీ మోటార్ ఇండియా ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ చబా మాట్లాడుతూ.. రెండో ప్లాంట్ ఏర్పాటు కోసం గుజరాత్ ప్రభుతంతో సంప్రదింపులు జరుపుతున్నామని, మరికొంత అదనపు భూమి కోసం చూస్తున్నామని తెలిపారు. గుజరాత్‌తో పాటు మరికొన్ని రాష్ట్ర ప్రభుతాలను కూడా సంప్రదించినట్టు వివరించారు. రెండో ప్లాంట్ లొకేషన్ కోసం అనేషిస్తున్నామని, రాష్ట్ర ప్రభుత ప్రతినిధులతో సమావేశం అవుతాయని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..