ప్రముఖ కార్ల తయారీ సంస్థ మోరిస్ గరాజస్ ఇండియా (ఎంజీ ఇండియా) ఇటీవల మార్కెట్లో విడుదల చేసిన కామెట్ ఈవీ కారు బుకింగ్స్ సోమవారం నుంచి ప్రారంభమైనట్లు కంపెనీ తెలిపింది. ఎంజీ ఇండియా కంపెనీ వెబ్‌సైట్‌తో పాటు, స్థానికంగా ఉన్న ఎంజీ మోటార్స్ డీలర్ల వద్ద 11 వేలు చెల్లించి బుక్ చేసుకోవచ్చని తెలిపింది. కస్టమర్లు బుక్ చేసుకున్న కారు పరిస్థితి తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ట్రాక్ అండ్ ట్రేస్ అనే కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు తెలిపింది. మైఎంజీ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకోవచ్చని పేర్కొంది.
ఎంజీ కమెట్ ఈవీ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులో బేస్ వేరియంట్ ధర 7.98 లక్షలుగా ఉంది. ప్లే వేరియంట్ 9.28 లక్షలు, ప్లష్ వేరియంట్ ధర 9.98 లక్షలు ఎక్స్‌షోరూమ్ ధరగా కంపెనీ నిర్ణ యించింది. ఈ ధరలు కూడా ముందుగా బుక్ చేసుకున్న 5 వేల బుకింగ్స్ మాత్రమే వర్తిస్తుందని ఎంజీ మోటార్స్ తెలిపింది. కార్లను బుక్ చేసుకున్న వారికి మే 22 నుంచి డెలివరీలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
కామెట్‌పై కంపెనీ బై బ్యాక్ సదుపాయాన్ని ప్రకటించింది. మూడు సంవత్సరాల తరువాత కస్టమర్ ఈ వాహనాన్ని వెనక్కి ఇస్తే ఎక్స్‌షోరూమ్ ధరలో 60 శాతం వెన క్కి ఇస్తామని తెలిపింది. కంపెనీ ఈ కారుపై మూడు సంవత్సరాలు లేదా ల క్ష కిలోమీటర్ల వరకు వారెంటీని ఆఫర్ చేస్తోంది. మూడు సంవత్సరాల పాటు రోడ్‌సైడ్ అసిస్టెన్స్, 3 లేబర్ ప్రీ సర్వీసులు, 8 సంవత్సరాలు లేదా 1.20 లక్షల కిలోమీటర్ల వరకు బ్యాటరీ వారెంటీని ఇస్తోంది. ఒక సారి ఛార్జ్ చేస్తే ఈ కారులో 230 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.