ప్రభ న్యూస్, హైదరాబాద్ ప్రతినిధి : ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా హైదరాబాద్ మెట్రో జాయ్ రైడ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. అమీర్ పేట మెట్రో స్టేషన్ నుంచి మియాపూర్ వరకు విద్యార్థులతో కలిసి సామూహిక జాతీయ గీతాన్ని ఆలపించారు. దివ్యాంగులైన విద్యార్ధులతో పాటు వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు ఈ జాయిరైడ్ కార్యక్రమంలో బాగస్వామ్యం కల్పించారు.
రాష్ట్ర ప్రభుత్వం పిలుపుతో నగరంలోని 57 మెట్రో స్టేషన్లలో ఉదయం 11.30 గంటలకు అన్ని రైళ్లను నిలిపి వేసి ప్రయాణికులు, మెట్రో ఉద్యోగులు, అధికారులు జనగణమన గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా పలువురు భావోద్వేగానికి గురయ్యారు. భారత స్వాతంత్య్ర పోరాట స్మృతులను జ్ఞ ప్తికి తెచ్చుకుని కంటనీరు పెట్టారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.