Tuesday, November 26, 2024

China | చైనాలో మీటూ జర్నలిస్టుకు జైలుశిక్ష..

ప్రముఖ జర్నలిస్ట్‌, స్త్రీవాద కార్యకర్త సోఫియా హువాంగ్‌ జుకిన్‌కు చైనా కోర్టు ఒకటి ఐదేండ్ల జైలుశిక్ష విధించింది. సోఫియాతో పాటు మరో హక్కుల కార్యకర్త వాంగ్‌ జియాన్‌బింగ్‌కు మూడేళ్ల జైలుశిక్ష పడింది. ఆమెపై కేసు నమోదు చేసిన కేసులో విచారణ జరిపిన కోర్టు.. వారిని అరెస్టు చేసిన మూడున్నరేండ్ల తర్వాత ఇవాళ తీర్పును వెల్లడించింది.

లైంగిక వేధింపుల బాధితుల గురించి రిపోర్టింగ్‌ చేస్తూ చైనాలో మీటూ ఉద్యమాన్ని చేపట్టారు. చెనా ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న మీడియాలో లైంగిక వేధింపులపై ఆమె గళం విప్పడంతో ఆమెను పోలీసులు 2021 సెప్టెంబర్‌ నెలలో అరెస్ట్‌ చేశారు. లండన్‌లోని యూనివర్శిటీ ఆఫ్‌ ససెక్స్‌లో చేరేందుకు చైనా నుంచి బయల్దేరడానికి ఒకరోజు ముందు సోఫియాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

2023 సెప్టెంబర్‌లో కోర్టు విచారణ మొదలెట్టింది. బ్లాక్‌ జైల్స్‌గా పిలిచే రహస్య ప్రదేశాల్లో వీరిద్దరిని బంధించినట్లుగా తెలుస్తున్నది. జైలుశిక్ష విధించడానికి ముందు ఆమెకు నోటీసు ఇచ్చిన కోర్టు అధికారులు.. ప్రజలు, మీడియా రాకుండా గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement