Saturday, November 23, 2024

తెలంగాణ, ఏపీకి వాతావరణ శాఖ గుడ్ న్యూస్..

జూన్ మాసంలో అప్పుడే రెండు వారాలు గడచినా నైరుతి రుతుపవనాలు ఆశించిన స్థాయిలో ఫలితాన్నివ్వలేకపోయాయి. ఈ నేపథ్యంలో, భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తాజా సమాచారం అందించింది. దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు ముందంజ వేసేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వివరించింది. తెలంగాణ, ఏపీలోని కొన్ని ప్రాంతాలు, ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్, దక్షిణ మధ్యప్రదేశ్, సెంట్రల్ మహారాష్ట్ర, మరాట్వాడా, కర్ణాటక, తమిళనాడు, విదర్భ, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయవ్య బంగాళాఖాతం, ఒడిశాలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్ గంగా నదీ పరీవాహక ప్రాంతం, ఝార్ఖండ్, సబ్ హిమాలయన్ పశ్చిమ బెంగాల్ ప్రాంతం, బీహార్ లోని కొన్ని ప్రాంతాల్లో వచ్చే రెండు మూడు రోజుల్లో రుతుపవనాలు మరింత విస్తరిస్తాయని ఐఎండీ వెల్లడించింది. రుతుపవనాల ప్రభావంతో దేశంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షపాతం నమోదైందని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement