న్యూయార్క్: ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా తాజాగా మరో ఆరువేల మందికి ఉద్వాసన పలుకుతున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. కంపెనీ సామర్థ్యాన్ని మెరుగుపర్చడంలో భాగంగా ఉద్యోగులను తీసివేయనున్నట్లు మార్చిలో సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించారు. దీనిలో భాగంగానే దాదాపు 10 వేల మందికి ఉద్వాసన పలుకుతామని మార్చిలోనే మెటా ప్రకటించింది. దీంతో ఏప్రిల్‌లో నాలుగు వేల మందిని ఇంటికి పంపిన ఈ సంస్థ తాజాగా ఆరు వేల మందిని తొలగించింది. మార్కెటింగ్, సైట్ సెక్యూరిటీ, ఎంటర్‌ప్రైజ్ ఇంజినీరింగ్, ప్రోగ్రాం మేనేజ్‌మెంట్ సహా చాలా విభాగాల్లో తొలగింపులు చోటు చేసుకున్నాయి. తొలగింపుల్లో భాగంగా భారత్‌లో పనిచేస్తున్న ఉద్యోగులనూ మెటా ఇంటికి పంపింది. పింక్ స్లిప్స్ అందుకున్న వారిలో భారత్‌లో పలువురు ఉన్నతోద్యోగులు ఉన్నట్లు సమాచారం. మార్కెటింగ్ విభాగం డైరెక్టర్ అవినాశ్ పంత్, మీడియా పార్ట్‌నర్‌షిప్స్ డైరెక్టర్ సాకేత్ ఝా సౌరభ్ సైతం ఉద్యోగాలు కోల్పోయారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement