హైదరాబాద్, (ప్రభ న్యూస్) : ప్రజలను నిరంతరం కనెక్ట్ చేసే అంతర్జాతీయ సంస్థగా పేరు తెచ్చుకుంది మెటా. ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ అయినటువంటి మెటా… ఎప్పటికప్పుడు నిజమైన సమాచారానికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తుంది. ఎలాంటి అవాస్తవాలకు అసలు చోటు ఇవ్వకూడదనే లక్ష్యంతో నిరంతరం పనిచేస్తూనే ఉంది. ప్రత్యేకంగా దక్షిణాది రాష్ట్రాల కోసం న్యూస్ మీటర్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది మెటా.
ఈ సందర్భంగా భారతదేశంలో మెటా డైరెక్టర్, పార్ట్నర్షిప్స్ హెడ్ మనీష్చోప్రా మాట్లాడుతూ… తప్పుడు సమాచారం వ్యాప్తిని ఎదుర్కోవడానికి కట్టుబడి ఉన్నామన్నారు. అందుకోసమే అంతర్జాతీయ స్థాయి ఫ్యాక్ట్ చెకింగ్ నెట్‌వర్క్‌ను రూపొందించామన్నారు. ఇప్పుడు న్యూస్‌మీటర్‌తో భాగస్వామ్యం ద్వారా.. ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రాంతీయ భారతీయ భాషల్లో ఉన్న తప్పుడు సమాచారాన్ని అరికట్టడం తమకు మరింత సులువు అవుతుందన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.