క్వార్టర్ ఫైనల్‌లో భాగంగా అర్జెంటీనా, నెదర్లాండ్ జట్లు పోటీపడుతున్నాయి. రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన అర్జెంటీనా తమ ఖాతాలో మూడో టైటిల్‌ను వేసుకోవాలని పట్టుదలతో ఉంది. అదే సమయంలో మొదటి కిరీటాన్ని సొంతం చేసుకునేందుకు నెదర్లాండ్స్ పోరాడుతుంది. ప్రారంభ మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో ఖంగుతున్న అర్జెంటీనా ఆతర్వాత పుంజుకుంది. పోలాండ్, మెక్సికోలపై విజయాలతో గ్రూప్-సి నుంచి అగ్రగామిగా నిలిచారు. ప్రి క్వార్టర్స్‌లో 2-1 గోల్స్‌తో ఆస్ట్రేలియాను ఓడించి క్వార్టర్స్‌లోకి వచ్చారు. అదే సమయంలో నెదర్లాండ్స్ టోర్నీలో అజేయ జట్టుగా ఉంది. ఈక్వాడార్‌తో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది.
సెనెగల్, ఖతార్‌లపై గెలిచి గ్రూప్-ఎలో మొదటి స్థానంలో నిలిచింది. రౌండప్ 16కి అర్హత పొందింది. ఇక్కడ అమెరికాపై 3-1తో గెలిచి క్వార్టర్స్‌లోకి వచ్చింది. భారత కాలమాన ప్రకారం అర్జెంటీనా – నెదర్లాండ్స్ మ్యాచ్ అర్ధరాత్రి తర్వాత ప్రారంభం అవుతుంది. 12.30కి మొదలవుతుంది. తెల్లవారే సమయానికి ఫలితం వెల్లడవుతుంది. ఈ మ్యాచ్‌కు లుసైల్ స్టేడియం వేదికైంది.