మగవారి బలహీనతలను ఆసరాగా చేసుకుని ఫేస్బుక్లో ఫ్రెండ్స్ రిక్వెస్టులు పంపడం, ఆపై స్నేహితులయ్యాక డేటింగ్లు, మీటింగ్‌ల పేరుతో మెసేజ్‌లు పెడుతారు. మత్తెక్కించే మాటలతో అవతలి వాళ్లను బుట్టలో వేసుకుంటారు. అందమైన యువతులను టెలికాలర్స్ గా పెట్టుకుని అవతలి వారిని ఆకట్టుకుంటారు. నమ్మకం కుదిరాక నగ్నంగా వీడియోకాల్ చేసి వారిని లోబర్చుకుంటారు. ఆ తర్వాత నగ్నంగా ఉన్న వీడియోలు, ఫొటోలను వారికి పంపుతారు. ఫొటోలు, వీడియోలు బయటకు రాకుండా ఉండాలంటే పెద్ద మొత్తంలో డిమాండ్ చేస్తారు. బాధితుడు అందినకాడల్లా అప్పు చేసి నిందితులకు ముట్ట చెబుతూనే ఉంటాడు. అయినా మళ్లీ మళ్లీ అడుగుతూనే ఉంటారు. ఇవ్వకుంటే వాటిని ఫ్రెండ్స్ కు, కుటుంబ సబ్యులకు పంపిస్తామని బెదిరిస్తారు. ఇలాంటి ఘటనలు హైదరాబాద్ నగరంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో తరుచూ జరగుతున్నాయి. నిందితులు అడిగినంత ఇచ్చుకోలేని కొంతమంది మాత్రం పోలీసులను ఆశ్రయిస్తున్నారు. చాలా మంది వీరి బారిన పడ్డా ఎంతో కొంత ఇచ్చుకుని బతుకు జీవుడా అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు. చాలా వరకు ఇలాంటి కేసులు బయటకు రావడంలేదని పోలీసులు భావిస్తున్నారు.
కలకత్తా వేధికగా భారీ నెట్ వర్క్..
అమందమై అమ్మాయిలను టెలి కాలర్స్ గా పెట్టుకుని మత్తెక్కించే మాటలతో మగాళ్లను మాయలో పడేసే భారీ నెట్ వర్క్ నడుస్తోందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పటి వరకు హైదరాబాద్‌తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగినప్పటికీ ఓ ముఠాగా ఏర్పాడి ఇలాంటి మోసాలకు పాల్పడలేదని తెలుస్తోంది. కలకత్తా వేదికగా ఏర్పాడ్డ ముఠా మాత్రం అదే పనిగా మోసాలకు పాల్పడుతన్నట్టు భావిస్తున్నారు. ఈ ముఠా ముంబాయి, ఢిల్లీ, చెన్నై లాంటి మెట్రో నగరాలనే టార్గెట్‌గా చేసుకుని మోసాలకు పాల్పడున్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి వారి పట్ల యువకులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఇతర అకౌంట్లలోకి నగదు తరలింపు..
న్యూడ్ ఫొటోలు, వీడియోల ద్వారా బ్లాక్ మెయిల్ చేసి బాదితులనుంచి కొల్ల గొట్టిన మొత్తాన్ని తమ అకౌంట్లకు కాకుండా ఇతర ఎకౌంట్లకు మళ్లిస్తారు. నేరుగా ఎకౌంట్లో కాకుండా ఫోన్ పే, గూగుల్ పే, నెట్ బ్యాంకింగ్ ద్వారా బ్యాంక్ ఖాతాల్లో జమ చేసుకుంటున్నారు. ఇందుకు గాను ప్రత్యేకమైన నెట్ వర్క్ నే ఏర్పాటు చేసుకుంటున్నారు. దోచుకున్న మొత్తాలను కొన్ని రోజుల వరకు ఇతరుల ఎకౌంట్లలో దాచి పెట్టడానికి కొంత మొత్తం చెల్లిస్తున్నారని పోలీసులు భావిస్తున్నారు. ఫోన్ పే, గూగుల్ పే నెంబర్లు తరుచూ మార్చుతూ నిందితులు ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..