Friday, November 22, 2024

మానసికంగా దెబ్బతీసేందుకే అలా చేశారనుకుంటా:బాక్సర్ మేరీకోమ్

టోక్యో ఒలింపిక్స్‌ ప్రీక్వార్టర్స్ లో ఓటమి చెందిన స్టార్ బాక్సర్ మేరీకోమ్ ఇండియాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమే భావోద్వేగం మాట్లాడారు. ఒలింపిక్స్‌లో దేశానికి పతకం తీసుకురాలేక‌పోయాన‌ని, ఇందుకు బాధగా ఉంద‌ని చెప్పారు. తాను కచ్చితంగా గెలుస్తాన‌ని భావించాన‌ని అన్నారు. తాను బాగానే ఆడిన‌ప్ప‌టికీ ప్రీక్వార్టర్స్‌ మ్యాచ్‌లో న్యాయ నిర్ణేతల తీరు సరిగా లేదని చెప్పారు. మొద‌టి రెండు రౌండ్లు గెలిచినప్ప‌టికీ తాను ఎందుకు ఓడిపోతానని ప్ర‌శ్నించారు. బౌట్‌కు ముందు అధికారులు త‌న దగ్గరకు వచ్చి సొంత జెర్సీని వాడకూడదని చెప్పార‌ని తెలిపారు. తొలి మ్యాచ్‌లో చెప్పని అభ్యంతరం ప్రీక్వార్టర్స్‌లో ఎందుకు చెప్పారని నిల‌దీశారు. త‌న‌ను మానసికంగా దెబ్బతీయడానికే న్యాయ నిర్ణేత‌లు అలా చేశారని భావిస్తున్న‌ట్లు చెప్పారు. ఇక బాక్సింగ్‌కు ఇక గుడ్ బై చెప్పేస్తారా? అన్న ప్ర‌శ్న‌కు ఆమె స‌మాధానం చెబుతూ…  తనకు బాక్సింగ్ చేసే స‌త్తా ఇంకా ఉంద‌ని చెప్పారు. త‌న‌కు 40 ఏళ్లు వచ్చేవరకు ఆడుతూనే ఉంటాన‌ని తెలిపారు. త‌దుప‌రి ఒలింపిక్స్‌లోనూ ఆడేందుకు తాను ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తాన‌ని చెప్పారు.  

ఇది కూడా చదవండి: సంక్రాంతి అదిరిపోయేలా..బరిలో పవన్, మహేష్, ప్రభాస్..

Advertisement

తాజా వార్తలు

Advertisement