Wednesday, December 11, 2024

TG | మున్సిపాల్టీల్లో 51గ్రామ పంచాయతీలు విలీనం….

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, సంగారెడ్డి జిల్లాల్లోని 51 గ్రామ పంచాయతీలను సమీప మున్సిపాలిటీల్లో విలీనమయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం గెజిట్‌ను విడుదల చేసింది. గ్రామ పంచాయతీల విలీనాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పుతో పంచాయతీల విలీనానికి ఆమోదం తెలుపుతూ గవర్నర్ గెజిట్ విడుదల చేశారు.

రంగారెడ్డి జిల్లా పరిధిలో 12 గ్రామాలను 4 మున్సిపాలిటీల్లో కలపగా అత్యధికంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని 28 గ్రామాలను 7 మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. సంగారెడ్డి జిల్లా పరిధిలో 11 గ్రామాలను అక్కడి రెండు మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. గ్రామ పంచాయతీల విలీనంతో ఔటర్ రింగు రోడ్డు పరిధి మొత్తం పూర్తి పట్టణ ప్రాంతంగా మారనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement