Tuesday, November 26, 2024

మెర్డెకా ఫుట్ బాల్ కప్.. ఆతిథ్య జ‌ట్టుతో తలపడనున్న‌ భారత్

మలేషియాలోని కౌలాలంపూర్‌లోని బుకిట్ జలీల్ లో ఈ ఏడాది జ‌ర‌గ‌నున్న ఫుట్ బాల్ టోర్న‌మెంట్ కు భార‌త జ‌ట్టు సిద్దంగా ఉంది. అక్టోబ‌ర్ నుండి ఈ FIFA అంతర్జాతీయ మెర్డెకా కప్ 2023 ఫుట్ బాల్ మ్యాచ్ లు జ‌ర‌గ‌నున్నాయి.. ఈ టోర్న‌మెంట్ మ్యాచ్ లు ఆడేందుకు భారత పురుషుల ఫుట్‌బాల్ టీమ్ సిద్ధమైంది.

మెర్డెకా కప్ అనేది… మలేషియా స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తారు. ఈ టోర్నమెంట్ ఆసియాలోని పురాతనమైన, అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లలో మెర్డెకా కప్ ఒకటి. దీన్ని ఒకప్పుడు ‘గ్రాండ్ ఓల్డ్ లేడీ ఆఫ్ ఆసియా’గా పరిగణించేవారు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి జట్లు ఇక్క‌డ పోటీప‌డేందుకు వ‌చ్చేవి.

కాగా, ఈ టోర్నమెంట్‌లో భార‌త్ త‌న గోల్డెన్ ఎరా నుండి పి.కె.బెనర్జీ, తులసీదాస్ బలరామ్ వంటి కొంతమంది స్టార్ ఆటగాళ్లను ప్ర‌పంచానికి చూపించింది. ఇక‌, భారత జ‌ట్టు ఈ టోర్నీలో రెండు (1959 -1964) సార్లు రన్నరప్‌గా నిలిచింది. ఇక చివరిసారిగా 2001లో ఈ టోర్నీలో ఆడిన‌ప్పుడు.. గ్రూప్ స్టేజ్ లోనే నాకౌట్ అయింది. ఈ టోర్నీలో మెత్తం నాలుగు జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి.

- Advertisement -

ఇక ఈ మెర్డెకా టోర్నమెంట్ లో ఆడ‌నున్న భార‌త్ బ్లూ టైగర్స్ జ‌ట్టు సెమీఫైనల్ మ్యాచ్ లో ఆతిథ్య దేశం మలేషియా జ‌ట్టుతో తలపడుతుంది. అలాగే మరో సెమీఫైనల్‌లో పాలస్తీనాతో లెబనాన్ ఆడ‌నుంది.

మెర్డెకా కప్ 2023 షెడ్యూల్..

సెమీఫైనల్ 1: అక్టోబర్ 13 – పాలస్తీనా vs లెబనాన్ – మధ్యాహ్నం 2:30
సెమీఫైనల్ 2: అక్టోబర్ 13 – మలేషియా vs భారత్ – సాయంత్రం 6:30
త‌ర్డ్ ప్లేస్ గేమ్: అక్టోబర్ 17 – SF 1 లో ఓడిపోయిన జట్టు vs SF 2లో ఓడిపోయిన జట్టు – 2:30 pm
ఫైనల్: అక్టోబర్ 17 – SF 1 విజేత vs SF 2 విజేత – సాయంత్రం 6:30


అన్ని మ్యాచ్‌లు కౌలాలంపూర్‌లోని బుకిట్ జలీల్ నేషనల్ స్టేడియంలో జరుగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement