Friday, November 22, 2024

జిఎస్టీ ప‌న్నెంత‌? అద‌న‌పు బాదుడెంత‌?

న్యూఢిల్లి, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి – పన్నుల వసూళ్ళ విధానంలో కేంద్రం పలు రకాల వ్యత్యాసాలకు పాల్పడు తోంది. ఆదాయ పన్ను, ఎక్సైజ్‌ పన్నుల వసూళ్ళ విషయంలో చెల్లింపుదార్ల పట్ల అనుసరించే విధానాలకు భిన్నంగా జీఎస్‌టీ విషయంలో కఠిన వైఖరి అవ లంభిస్తోంది. జీఎస్‌టీ మినహా ఇతర పన్నుల చెల్లింపు విషయంలో ఆలస్యా నికి కొద్దిపాటి అపరాధ రుసుం లేదా వడ్డీల్ని వసూలు చేస్తోంది. అదే జీఎస్‌టీ విషయానికొచ్చేసరికి క్షేత్రస్థాయి నుంచి కేంద్రం స్పష్టమైన లక్ష్యాల్ని నిర్దేశిస్తోంది. నెలనెలా ఈ లక్ష్యాల్ని పెంచుతోంది. ఇందుకనుగుణంగా వసూళ్ళు జరగా ల్సిందేనని హెచ్చరిస్తోంది. దీంతో అధికారులు జీఎస్‌టీ వసూళ్ళను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఏ కొద్దిపాటి లోపాలకు, అలక్ష్యాలకు ఆస్కారం ఇవ్వడంలేదు. సకాలంలో చెల్లించని వారిపై కఠిన వైఖరిని అవలంభిస్తున్నారు. కఠిన వైఖరంటే వారిపై మరింతగా ఆర్థిక భారం మోపడం. అరగంట జాప్యమైనా అపరాధ రుసుములు జత చేస్తున్నారు.

అలాగే రోజుల వారీ వడ్డీలు కలిపేస్తున్నారు. ఆ వడ్డీలకు కూడా చక్రవడ్డీలు లెక్కలేస్తున్నారు. ఇలా ప్రతి వంద రూపాయల చెల్లింపుదార్ల నుంచి ఏవొక సాకులు చెప్పి 175రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. దీంతో జీఎస్‌టీ అంటేనే చెల్లింపులుదార్లు భయపడే పరిస్థితి ఏర్పడింది. మిగిలిన పన్నులతో పోలిస్తే జీఎస్‌టీ చెల్లింపుదార్లకు అత్యంత భారంగా మారింది. ఒక రోజు జాప్యమైనా ప్రభుత్వానికి చెల్లించక తప్పదు. కానీ ఇంత దూకుడుుగా కఠినంగా చెల్లింపుదార్ల పట్ల అధికారులు ఆర్థిక ఆంక్షలు విధించడం తీవ్ర వివాదాస్పదమౌతోంది. వాస్తవానికి నెలనెలా దేశంలో జీఎస్‌టీ వసూళ్ళు పెరుగుతున్నాయి. ఇలా ఏటేటా ఇవి రెట్టింపు అవుతున్నాయి. క్షేత్రస్థాయిలో వినియోగం పెరిగి విక్రయాలు జోరందుకుని ఈ పన్నుల మొత్తం పెరుగుతోందంటూ ప్రభుత్వం ప్రకటిస్తోంది. ఈస్థాయిలో వినియోగం పెరగడం దేశ ప్రజల జీవన ప్రమాణాల వృద్ధికి సూచికగా ప్రచారం చేసుకుంటోంది. అయితే వాస్తవం ఇందుకు భిన్నంగా ఉందని పరిశీలకులు పేర్కొంటున్నారు. జీఎస్‌టీ వసూళ్ళలో అసలు పన్ను, దానిపై వేస్తున్న వడ్డీలు, అపరాధ రుసుముల్ని విడివిడిగా ప్రకటిస్తే పెరిగిన జీవన ప్రమాణాల వృద్ధి ఏ మేరకన్న అంశంపై ప్రజలకు స్పష్టత వస్తుందని వీరు పేర్కొంటున్నారు. ఇతర పన్నుల తరహాలోనే జీఎస్‌టీ వసూళ్ళపై కూడా ఆంక్షల కొరడాలు స డలించాలని కేంద్రానికి చెల్లింపుదార్లు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement