Monday, November 18, 2024

మెన్స్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మన్త్‌ అవార్డు కోహ్లీకే

టీ 20 వరల్డ్‌ కప్‌లో వరుస హాఫ్‌ సెంచరీలతో విరాట్‌ కోహ్లీ అదరగొడుతున్నాడు. బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లోనూ 64 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తన ఆట తీరుతో అక్టోబర్‌ నెలకు అతను ఐసీసీ మెన్స్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మన్త్‌ అవార్డ్‌కి నామినేట్‌ అయ్యాడు. అక్టోబర్‌ నెలలో టీ 20 మ్యాచ్‌ల్లో కోహ్లీ 200 సగటు, 150. 73 స్ట్రైక్‌ రేటుతో 205 పరుగులు చేశాడు. ఈ అవార్డుకి కోహ్లీ నామినేట్‌ కావడం ఇదే మొదటి సారి. ఇతనితో పాటు దక్షిణాఫ్రికా బ్యాటర్‌ డేవిడ్‌ మిల్లర్‌, జింబాబ్వే ఆటగాడు సికిందర్‌ నామినేట్‌ అయ్యారు.

నలుగురు భారత ఆటగాళ్లు విజేతలు

అన్ని క్రికెట్‌ ఫార్మట్లలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లను గుర్తించి, వాళ్లను గౌరవించడం కోసం ఐసీసీ 2021 జనవరిలో ప్లేయర్‌ ఆఫ్‌ ది మన్త్‌ అవార్డుని మొదలు పెట్టింది. ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మన్త్‌ అవార్డుని ఇప్పటివరకు నలుగురు భారత ఆటగాళ్లు ఈ అవార్డు గెలిచారు. అక్టోబర్‌ నెలకు ఐసీసీ విమెన్స్‌ ప్లే ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మన్త్‌ అవార్డు కోసం భారత మహిళల క్రికెట్‌ టీం నుంచి బ్యాటర్‌ జెమీమీ రోడ్రిజ్‌, దీప్తి శర్మ, పాకిస్తాన్‌ జట్టు నుంచి దార్‌ నామినేట్‌ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement