Saturday, November 23, 2024

‘మెన్ టు’ ని ఆద‌రిస్తారు – శర్వానంద్

నరేష్‌ అగస్త్య, బ్రహ్మాజీ, హర్ష చెముడు, సుదర్శన్‌, మౌర్య సిద్ధవరం, రియా సుమన్‌, ప్రియాంక శర్మ ప్రధాన తారాగణంగా నటించిన చిత్రం ‘మెన్‌ టూ’. శ్రీకాంత్‌ జి. రెడ్డి దర్శకత్వంలో మౌర్య సిద్ధవరం నిర్మిస్తున్నారు. హీరో శర్వా నంద్‌ ముఖ్య అతిథిగా హాజరవగా టీ-జర్‌ విడుదల చేశారు.
ఈ సందర్భంగా… హీరో శర్వానంద్‌ మాట్లాడుతూ ” నిర్మాత హీరో మౌర్యకి అభినందనలు. రణరంగం సినిమా లో ఇద్దరం కలిసి నటించాం. తను ప్రొడ్యూస్‌ చేస్తున్నానని చెప్పినప్పుడు ఎందుకు ప్రొడక్షన్‌ అని చెప్పా. అతను స్కిప్ట్ర్‌ నచ్చి సినిమా చేశాడు. యంగ్‌స్టర్స్‌ కొత్తగా ఇలా చేస్తుంటే బా గా అనిపించింది. మేము ప్యాషన్‌తో, నమ్మకంతో, ఆశతో సిని మా చేస్తాం. ఈ సినిమా పెద్ద సక్సెస్‌ కావాలి. నిర్మాతగా కూడా మౌర్య సక్సెస్‌ అయ్యాడని, బిజినెస్‌ బాగా జరిగిందని విన్నా. టీ-మ్‌కి అభినందనలు.” అని అన్నారు.

దర్శకుడు సుధీర్‌ వర్మ మాట్లాడుతూ టీ-జర్‌ అందరికీ నచ్చిందనుకుంటు-న్నా. మౌర్య సినిమా కూడా చూపించాడు. అందరికీ నచ్చుతుం దని భావిస్తున్నా. అని అన్నారు.నటు-డు బ్రహ్మాజీ మాట్లాడు తూ ఆడవాళ్ల గురించి, వాళ్లు పడే బాధలు గురించి సినిమా లు వచ్చాయి. ఇప్పుడు మగవాళ్ల మీద సినిమా వచ్చింది. అదే మెన్‌ టూ. ఏదో ఆడ వాళ్లని తక్కువ చేసి చూపించాలనే ఉద్దే శంతో చేసిన సినిమా కాదు. లేడీస్‌ వల్ల జెంట్స్‌ ఎంత బాధప డుతున్నారు.. వాళ్ల వల్ల వచ్చే సమ స్యలను నిజాయితీగా చూపించే ప్రయత్నం చేశారు. మగవా ళ్ల బాధలను చూపించే చిత్రం. అన్నారు. చిత్ర దర్శకుడు శ్రీకాంత్‌ జి.రెడ్డి మాట్లాడుతూ ” హ్యాష్‌ ట్యాగ్‌ మెన్స్‌ టూ సినిమా స్టోరీతో సినిమా చేయాలనుకుంటే వీడెవరో కాంట్రవర్సీ చేయాలనుకుంటు-న్నాడని అందరూ అనుకున్నారు. అయితే మౌర్యగారు నమ్మకంతో ఒప్పు కున్నారు. అన్నారు. నిర్మాత మౌర్య సిద్ధవరం మాట్లాడుతూ యంగ్‌ టీ-మ్‌తో కలిసి మంచి సినిమా చేశామని అనుకుంటు-న్నాను అన్నారు. హీరో నరేష్‌ అగస్త్య మాట్లాడుతూ మెన్‌ టూ అనే -టైటిల్‌ ఉన్నప్పటికీ అమ్మాయిలకే ఈ మూవీ ఎక్కువ నచ్చుతుందని అనుకుంటు-న్నాను. అన్నారు.
కౌశిక్‌ ఘంటసాల, రచయిత రాకేందు మౌళి, దర్శకుడు శరణ్‌ కొప్పిశెట్టి కూడా మాట్లాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement