టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పదవి బాద్యతలని చేపట్టిన నాటి నుంచి నేటి వరకు పార్టీని బలపరిచే విధంగా కృషి చేస్తున్నారు. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బల్మూరి వెంకట్ ని నిలబెట్టినా ఆయన ఓటు హక్కుని వినియోగించుకోకపోవడం విశేషం. మరి ఆ విషయాన్ని పక్కన పెట్టి ఇప్పుడు కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడం విశేషం.అంతేకాదు కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న వారికి రెండు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ సభ్యత్వం ఇవ్వడం అంటే… కాంగ్రెస్ కుటుంబంలో సభ్యుడు కావడమేనని చెప్పారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న వాళ్లంతా…సోనియా గాంధీ కుటుంబ సభ్యులు అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం విశేషం. చిల్లర మల్లర పార్టీలు మనకు పోటీ కాదు అంటూ రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజల బానిస సంకెళ్లు తెంచిన పార్టీ కాంగ్రెస్ అని గుర్తు చేశారు. దేశం కోసం కొట్లాడింది కాంగ్రెస్ అని…మిగిలిన పార్టీలో సగం మంది లోఫర్ లు…ఇంకొంత మంది బ్రోకర్లు ఉన్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం రాహుల్ గాంధీ లాంటి గొప్ప నాయకుడి పార్టీ లో సభ్యులం అని చెప్పుకోవడం గర్వంగా ఉందన్నారు. పేదల కోసం… ఉపాధి.. పారదర్శకత కోసం సమాచార హక్కు చట్టం, విద్యను హక్కు గా మార్చిన పార్టీ కాంగ్రెస్ అని వ్యాఖ్యానించారు.