సాధారణంగానే అమ్మాయిలు బయటికి వెళ్ళాలంటే ఎంతోకొంత మేకప్ వేసుకుంటారు. అయితే ఇక్కడ ఓ యంగ్ వుమెన్ మాత్రం ఏకంగా మిస్ ఇంగ్లండ్ పోటీలకి విత్ అవుట్ మేకప్ తో పోటీలల్లో పాల్గొననుంది. ఇంగ్లండ్ లో జరుగుతున్న మిస్ ఇంగ్లండ్ పోటీల్లో రికార్డు సృష్టించింది మెలీసా రవూఫ్. లండన్ కు చెందిన 20 ఏళ్ల మెలీసా రవూఫ్.. మిస్ ఇంగ్లండ్ అందాల పోటీలో ఎటువంటి మేకప్ లేకుండా పాల్గొంది. మిస్ ఇంగ్లండ్ కిరీటం కోసం అక్టోబర్ 17న ఫైనల్స్ జరుగనున్నాయి. ఆ పోటీలో మరో 40 మందితో మెలీసా పోటీపడనుంది.
94 ఏళ్ల ఈ అందాల పోటీల చరిత్రలో ఇలా మేకప్ లేకుండా పాల్గొన్న తొలి మహిళ మెలీసా రవూఫ్ కావడం విశేషం. ఈ పోటీల్లో పాల్గొనడమే కాదు.. ఫైనల్స్ వరకు ఈమె దూసుకెళ్లింది కూడా. 2019లో జరిగిన మిస్ ఇంగ్లండ్ అందాల పోటీల్లో కంటెస్టెంట్లు మేకప్ లేకుండానే పాల్గొనే ఒక రౌండ్ ను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. అది అంతగా ఆకట్టుకోలేదు. అయితే పోటీలో మొదటి నుంచి ఫైనల్ దాకా ఓ యువతి ఇలా మేకప్ లేకుండా పాల్గొనడం ఇదే తొలిసారి అని పోటీల నిర్వాహకులు వెల్లడించారు. మహిళలు బాహ్య సౌందర్యంతోపాటు.. అంతః సౌందర్యానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చాటి చెప్పేందుకు.. వివిధ సౌందర్య సాధనాల కంపెనీలు అందానికి చెప్పే కొలమానాలను సవాల్ చేసేందుకే తాను మేకప్ లేకుండా పోటీలో పాల్గొంటున్నట్టు మెలీసా తెలిపింది.ఈమె తీరుపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి.