టాలీవుడ్ హీరోయిన్, అందాల నటి మెహ్రీన్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతోంది. తాజాగా ఈ అందాల భామ నిశ్చితార్థం ఆమె ప్రియుడు భవ్య బిష్ణోయ్‌తో ఘనంగా జరిగింది. జైపూర్‌లోని ఓ కోట వీరి నిశ్చితార్థ వేడుకకు వేదికైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను మెహ్రీన్ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఏడాది చివరిలో వీరి వివాహం జరగనుందని సమాచారం. కాగా భవ్య బిష్ణోయ్ హర్యానా మాజీ సీఎం భజన్‌లాల్ మనవడు. మెహ్రీన్ ప్రస్తుతం వెంకటేష్, వరుణ్‌తేజ్ ‘F3’లో నటిస్తోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement