Friday, November 22, 2024

మంచు మ‌నోజ్ ఇంట్లో మెహంది వేడుక‌లు..!

దివంగ‌త టిడిపి నేత భూమా నాగిరెడ్డి రెండో కుమారై భూమా మౌనిక‌రెడ్డితో న‌టుడు మంచు మ‌నోజ్ వివాహం జ‌ర‌గ‌నుంద‌నే ప్ర‌చారం ఇప్ప‌టికే జ‌రుగుతోంది. మార్చి 3న వీరి వివాహం ఘనంగా జరుగుతుందని ఇప్పటికే ఇన్ సైడ్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. అతికొద్ది మంది సభ్యులతో మంచు మనోజ్ – మౌనికా రెడ్డి వివాహాం జరుగుతున్నట్టు తెలుస్తోంది. వీరి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లన్నీ మ‌నోజ్ సోద‌రి మంచు లక్ష్మి ఇంట్లోనే నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆయా పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్న ఈ కాబోయే జంట.. ప్రస్తుతం పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు. పెళ్లి వేడుకల్లో భాగంగా ఈరోజు మెహందీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని సమాచారం.

ఇందుకు సంబంధించి మనోజ్ ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. వైట్ షర్ట్ లో మనోజ్ పెళ్లి వేడుకలో మెరిసినట్టు తెలుస్తోంది.మరోవైపు కొద్దిరోజులు మంచు మనోష్ కు వారి కుటుంబ సభ్యులకు కాస్తా పడటం లేదని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనోజ్ మెహందీ వేడుకల్లో తండ్రి Mohan babu లేడనే ప్రచారం జరుగుతోంది. మనోజ్ రెండో పెళ్లిపై తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆయనకు నచ్చలేదని ప్రచారం. దీంతో కనీసం పెళ్లికైనా వస్తారా? లేదా? అన్నది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గ్గా మారింది. ఏదేమైనా మంచు మనోజ్ రెండో పెళ్లితో కొత్త ఫేజ్ లోకి అడుగుపెట్టబోతున్నారని.. ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక మనోజ్ పెళ్లిపై అధికారిక ప్రకటన అందాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement