ఈరోజు ఉదయం మేఘాలయాలో భూకంపం వచ్చింది. మేఘాలయలోని తురాలో ఈ ఉదయం 6.32 గంటలకు భూమి కంపించింది. భూకంపం తీవ్రత రిక్టర్‌స్కేలుపై 4.0గా నమోదైంది. తురాకి 43 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని చెప్పింది. అలాగే టిబెట్‌లోని జిజాంగ్ ప్రాంతంలో కూడా భూమి కంపించింది. ఉదయం 4.01 గంటల సమయంలో 4.2 తీవ్రతతో భూకంపం వచ్చిందని ఎన్‌సీఎస్ పేర్కొన్నది. భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement