Wednesday, November 20, 2024

మంగోలియాలో కొత్త చ‌రిత్ర‌కు “మేఘా” నాంది.. మంగోలియాలో గ్రీన్ ఫీల్డ్ ఆయిల్ రిఫైన‌రీ

దేశ‌, విదేశాల్లో భారీ ప్రాజెక్టుల‌ను చేప‌ట్టి రికార్డు స‌మ‌యంలోనే అల‌వోక‌గా పూర్తి చేస్తున్న మేఘా ఇంజ‌నీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్ర‌క్ఛ‌ర్ లిమిటెడ్(ఎం ఈ ఐ ఎల్) సంస్థ కు మంగోలియా గ‌డ్డ‌పై మ‌రో ప్రతి ష్టాత్మ‌క ప్రాజెక్టు నిర్మించే ప‌నులు ద‌క్కాయి. మంగోలియా దేశంలోనే మొట్ట‌మొదటి చమురు శుద్ధి కర్మాగారాన్ని నిర్మించేందుకు ఉద్దేశించిన మంగోల్ ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్ట్ కోసం LOA (లెట‌ర్ ఆఫ్ ఆఫ‌ర్ అండ్ యాక్సెప్టెన్సీ)ని మేఘా అందుకుంది. EPC (ఇంజ‌నీరింగ్‌, ప్రొక్యూర్మెంట్‌ అండ్ కన్‌స్ట్ర‌క్ష‌న్‌) ఒప్పందం ప‌ద్ద‌తిలోఈ కొత్త రిఫైనరీని మంగోలియాలో ఎం ఈ ఐ ఎల్ నిర్మించ‌నుంది.

భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) డెవలప్‌మెంట్ పార్టనర్‌షిప్ అడ్మినిస్ట్రేషన్ చొరవ‌తో, భారత ప్రభుత్వం ఆర్థిక స‌హాయ స‌హ‌కారాల‌తో మంగోలియా దేశం ఈ భారీ గ్రీన్‌ఫీల్డ్ ఆయిల్‌ రిఫైన‌రీ ప్రాజెక్టును నిర్మించ‌నుంది. ఈ G2G (ప్ర‌భుత్వం నుంచి ప్ర‌భుత్వానికి) భాగస్వామ్య ప్రాజెక్ట్ కు ఇంజనీర్స్ ఇండియా (EIL), ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ (PMC)గా వ్య‌వ‌హ‌రించ‌నుంది. ఈ ప్రాజెక్ట్ వ‌ల్ల సమీప ప్రాంతాల్లో చిన్న పరిశ్రమల వృద్ధి గ‌ణ‌నీయంగా పెర‌గ‌నుంది. అంతేగాక‌, మంగోలియా దేశ ఆర్థిక అభివృద్ధి రేటు పెంపుద‌ల‌కు ఇది ఎంత‌గానో దోహ‌ద‌ప‌డ‌నుంది. అద‌నంగా అక్క‌డి స్థానిక ప్ర‌జ‌ల ఉపాధి అవకాశాలు మెరుగుప‌డి యువ‌త‌కు ప్రోత్సాహ‌క‌ర‌మైన భ‌విష్య‌త్ ఉండ‌బోతోంది.

ఇప్ప‌టికే హైడ్రోకార్బన్ రంగంలో మేఘా ఇంజ‌నీరింగ్ సంస్థ అద్భుతంగా రాణిస్తోంది. ఆఫ్‌షోర్‌,ఆన్‌షోర్ ఆయిల్‌ రంగంలో దేశంలోనే కీల‌క శ‌క్తిగా ఎదిగింది. ఈ ప్రాజెక్ట్ నిర్మించ‌డం వ‌ల్ల భారతదేశం, మంగోలియా దేశాల‌ మధ్య సంబంధాలు మరింత బ‌ల‌ప‌డ‌నున్నాయి. మంగోలియా ఆర్థిక ప‌రిపుష్టితోపాటు అక్క‌డ ప్ర‌జ‌ల జీవ‌న విధానం మెరుగుద‌ల‌కు ఈ నూత‌న ప్రాజెక్టు ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌నుంది.

మంగోలియా రిఫైనరీ ప్రాజెక్ట్ నిర్మిస్తే…

ప్ర‌స్తుతం మంగోలియా ర‌ష్యా నుంచి చ‌మురును దిగుమ‌తి చేసుకుంటోంది. ఈ గ్రీన్‌ఫీల్డ్ ఆయిల్ రిఫైన‌రీ ప్రాజెక్ట్ నిర్మాణంతో మంగోలియా చ‌యురు కోసం ర‌ష్యాపై ఆధార‌ప‌డాల్సిన అవ‌స‌రం ఉండ‌దు.. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత, ఈ రిఫైనరీ నుంచి రోజుకు 30,000 బ్యారెల్స్, ఏడాదికి 1.5 మిలియన్ టన్నుల ముడి చమురును ప్రాసెస్ చేయ‌వ‌చ్చు. ఇది రష్యా ఇంధనంపై మంగోలియా ఆధారపడే ప‌రిస్థితుల‌ను పూర్తిగా మార్చేస్తుంది. గ్యాసోలిన్, డీజిల్, విమాన ఇంధనం, ద్ర‌వీకృత పెట్రోలియం గ్యాస్ (LPG) వంటి పెట్రోలియం ఉత్పత్తులు ఇక్క‌డే ప్రాసెస్‌ కానున్నాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement