నేడు మెగాస్టార్ చిరంజీవి..సురేఖల పెళ్ళి రోజు.ఇది వారికి 44వ వివాహ వార్షికోత్సవం. మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్లో అంచెలంచెలుగా ఎదిగి కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. స్వయంకృషితో ఒక్కో మెట్టూ ఎదుగుతూ తనకంటూ ప్రత్యేక పేజీని లిఖించుకున్నారు.1978లో పునాదిరాళ్లు సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన చిరంజీవి తనదైన నటన, డ్యాన్సు స్టెప్పులతో ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. కెరీర్లో ఎదుగుతున్న సమయంలో ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య కూతురు సురేఖతో చిరంజీవి వివాహం జరిగింది.
అయితే అప్పుడప్పుడే హీరోగా ఎదుగుతున్న చిరుకి కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయడం ఏంటని అల్లు రామలింగయ్య వద్ద చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారట. అయినా ఇవేం పట్టించుకోని ఆయన చిరంజీవి కష్టపడే తత్వాన్ని గుర్తించి ఎప్పటికైనా అతడు స్టార్ హీరో అవుతాడని నమ్మకంతో చెప్పేవారట. ఆ దిశగా చిరును ఎంతగానో ప్రోత్సహించేవారట.కాగా 1980 ఫిబ్రవరి 20వ తేదీ ఉదయం 10 గంటల 55 నిముషాలకు చెన్నై(అప్పటి మద్రాసు)లోని శ్రీ రాజరాజేశ్వరి కళ్యాణమండపంలో చిరంజీవి, సురేఖల వివాహం జరిగింది..సురేఖ వచ్చిన తర్వాతే తన జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయని.. ఆమె వచ్చిన తర్వాతే తన కెరీర్ కూడా మారిపోయిందని చాలా సార్లు చెప్పుతుంటాడు చిరంజీవి.ఈ జంటకు ముగ్గురు సంతానం. సుస్మిత, శ్రీజ, రామ్ చరణ్. సుష్మిత.