మా బ్యాచ్ లో పెద్ద స్టార్ గా ఎదిగింది మెగాస్టార్ చిరంజీవేనని నటుడు నాజర్ అన్నారు. యాక్టింగ్ స్కూల్‌లో నేను, చిరంజీవి ఒకే బ్యాచ్‌లో చదువుకున్నాం. తను నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. చాలా సపోర్ట్‌గా ఉండేవారు. మా బ్యాచ్‌లో పెద్ద స్టార్‌గా ఎదిగిన వాళ్లలో తనే మొదటివాడు. ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో కోర్సు పూర్తయిన తర్వాత చిరంజీవి పెద్ద స్టార్ అయ్యారు. నాకు వెంటనే అవకాశం దక్కలేదు. ఆ సమయంలో నేను తాజ్ కోరమండల్ హోటల్‌లో వెయిటర్‌గా వర్క్ చేసేవాడిని. ఓసారి ఆ హోటల్ పక్కనున్న ఫిల్మ్ ఛాంబర్‌లో చిరంజీవి షూటింగ్ చేస్తున్నారు. నాకు ఆ విషయం తెలియదు. నేను మధ్యాహ్నం హోటల్ నుంచి ఇంటికి సైకిల్‌పై వెళుతుంటే జనాలు గుమిగూడి ఉండటం చూసి అక్కడకెళ్లి చూస్తే చిరంజీవి షూటింగ్ చేస్తున్నారు. సరే చిరంజీవి చూడక ముందే వెళ్లిపోదామని వెనక్కి తిరిగాను. కానీ అప్పటికే చిరంజీవి నన్ను చూసేశారు. పిలిచారు. ‘ఏంటి నాజర్ ఏం చేస్తున్నావు’ అని అడిగారు. ఇలా హోటల్‌లో పని చేస్తున్నానని చెప్పగానే.. ‘అదేంటి! అంత మంచి యాక్టర్‌వి హోటల్‌లో పని చేస్తున్నావా రేపు వచ్చి నన్ను కలుస్తున్నావు.. నేను మాట్లాడుతాను’ అన్నారు. నేను సరే అని చెప్పి వచ్చేశాను. కానీ వెళ్లి కలవలేదు. ఆ సమయంలో నాకు సినిమాలపై అంత నమ్మకం లేదు. నెల జీతం అయితేనే కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకునే అవకాశం ఉంటుందని అనుకునేవాడిని. హోటల్ కెరీర్‌లోనే సెటిల్ అయిపోతామని నిర్ణయించుకున్నాను. తర్వాత కొన్నాళ్లకు బాలచందర్‌గారిని కలిశాను. ఆయన నటుడిగా అవకాశం ఇచ్చారు. తర్వాత నెమ్మదిగా మంచి యాక్టర్‌గా పేరు తెచ్చుకున్నాను. కానీ ఇద్దరం కలిసి సినిమా చేసే అవకాశం రాలేదు. ఖైదీ నెంబర్ 150లో యాక్ట్ చేశాను. ఈ జర్నీలో చిరంజీవి పెద్ద స్టార్ అయ్యాడుగా.. నాకు ఓ వేషం ఇవ్వలేదే! అని నేనెప్పుడూ అనుకోలేదు. అలాగే నాజర్ ఎప్పుడూ అలా నాకు ఇది కావాలని అడగడు అని చిరంజీవికి కూడా తెలుసు.
Advertisement
తాజా వార్తలు
Advertisement