యాంకర్ సుమ కొత్త గేమ్ షోని ప్రారంభించారు. కాగా ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న చిత్రం వాల్తేరు వీరయ్యలోని సాంగ్ కి డ్యాన్స్ చేస్తుండగా..వెనకాల మెగాస్టార్ చిరంజీవి రావడంతో అంతా ఆశ్చర్యపోయారు. వాల్తేరు వీరయ్య సినిమాలోని పూనకాలు లోడింగ్ పాటకు సుమ డాన్స్ చేస్తూ ఉండగా సడన్ గా ఆ వీడియోలో కనిపించారు చిరంజీవి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుమ కొత్త గేమ్ షో కు హాజరయ్యారు మెగాస్టార్ చిరంజీవి. . దీనికి సంబందించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు సుమ. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement