స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్‌లో మెగా ప్రాపర్టీ షో నిర్వహిస్తోంది. కొండాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ హాల్‌లో ఈ ప్రాపర్టీ షో శనివారం ప్రారంభమైంది. 26, 27వ తేదీలు రెండురోజులపాటు జరిగే ఈ షో నేడు కూడా నిర్వహించనున్నారు. మూడు సంవత్సరాల విరామం తర్వాత ఎస్‌బీఐ ప్రముఖ బిల్డర్లను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఈ గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా టీఆర్‌ఈడీఎ హైదరాబాద్ సర్కిల్ జీఎం కృష్ణశర్మ, సీజీఎం అమిత్ మాట్లాడుతూ హైదారాబాద్ రియల్‌ఎస్టేట్ రంగానికి రాజధానిగా మారే అవకాశం ఉందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.5009 కోట్ల వృద్ధితో హైదరాబాద్ సర్కిల్ పాన్‌ఇండియా నంబర్‌వన్‌గా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాన్ని ఎస్‌బీఐఐ మేనేజింగ్ డైరెక్టర్ (ఆర్‌అండ్‌డీబీ) శ్రీనివాసులు శెట్టి ప్రారంభించగా సీజీఎం అమిత్ జింగ్రాన్, జనరల్ మేనేజర్లు జోగేష్ చంద్ర సాహూ, హైదరాబాద్ సర్కిల్‌కు చెందిన కిషన్‌శర్మతోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ మెగా ప్రాపర్టీషోలో హైదరాబాద్‌లోని క్రెడాయ్ ప్రెసిడెంట్ రామకృష్ణరావు, జనరల్ సెక్రటరీ రాజశేఖర్‌రెడ్డి, టీబీఎఫ్ ప్రెసిడెంట్ ప్రభాకర్‌రావు, ప్రెసిడెంట్ చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..