స్టార్ హీరో రామ్‌చరణ్ అరుదైన ఘనత సాధించాడు. సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. రీసెంట్ గా మేడమ్ టుస్సాడ్స్ ప్రతినిధులు… రామ్ చరణ్ కొలతలు తీసుకున్నారు. 2025 వేసవి నాటికి చెర్రీ మైనపు బొమ్మ అక్కడ ఏర్పాటు చేయనున్నారు.
కాగా, అబుదాబిలో జరిగిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ కార్యక్రమంలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. సినిమా రంగానికి ఆయన చేసిన సేవలకు గాను ‘మేడమ్ టుస్సాడ్స్ ఆఫ్ ది ఫ్యూచర్ అవార్డు’ను ఇస్తున్నట్లు వెల్లడించారు.
మేడమ్ టుస్సార్స్లోలో ఉన్న ‘ఐఐఎస్సీ జోన్ లో ఇప్పటికే షారుక్, అమితాబ్ బచ్చన్, కాజోల్, కరణ్ జోహార్ మైనపు విగ్రహాలు ఉన్నాయి. ఈ సందర్భంగా రామ్చరణ్ సంతోషం వ్యక్తం చేశారు. “సింగపూర్లోని మేడమ్ టుస్సాడ్స్ కొలువుదీరిన సూపర్ స్టార్స్ సరసన చేరడం నిజంగా నాకు దక్కిన గొప్ప గౌరవమని రామ్ చరణ్ పేర్కొన్నారు. తాను చిన్న వయస్సులో ఉన్నప్పుడు దిగ్గజ నటుల విగ్రహాలు చూసి ఆశ్చర్యపోయేవాడిని.. అలాంటిది వారి పక్కన ఇంతటి గౌరవం దక్కుతుందని కలలోనూ ఊహించలేదని అన్నారు. ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన మేడమ్ టుస్సాడ్స్ తాను కృతజ్ఞతలు చెబుతున్నానని పేర్కొన్నారు.