చైనా సరిహద్దుల్లో సుబాన్సిరి లోయర్హైడ్రో ప్రాజెక్టు పూర్తి కావచ్చింది.ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 2.6 బిలియన్లు ఇది అరుణాచల్‌ప్రదేశ్,అసోం రాష్ట్రాల మీదుగా ప్రవహించే సుబాన్సిరి దిగువ భాగంలో ఈ ప్రాజెక్టును నిర్మించారు.ఈ నది బ్రహ్మపుత్ర ఉపనది.టిబెట్‌లోని లుటెన్ కౌంటీ,అరుణాచల్ ప్రదేశ్,అసోంల మీదుగా ప్రవహిస్తుంది.ఈ నది పొడవు 442కిలో మీటర్లు.ఈ నదిపై నిర్మించిన హైడ్రో విద్యుత్ప్రాజెక్టు ఉత్పత్తి చేసే విద్యుత్ నిజానికి భారత్‌కి చెందినదే.దీనినిర్మాణ వ్యయం అంతా భారత్ భరిస్తోంది.
ఈ ప్రాజెక్టును నేషనల్ పవర్ప్రాజెక్టు కార్పొరేషన్ చేప ట్టింది.దీని మొదటి యూనిట్ ట్రయిల్ జూలైలో ప్రారంభమవుతుంది. 2024 నాటికిఈ ప్రాజెక్టులోని 8 యూనిట్లు పని చేయడం ప్రారంభమవుతాయి.ఈ ప్రాజెక్టు పనులు ఎనిమిది నెలల పాటు ఆగిపోయాయి. 2109లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి ఇవ్వడంతో పనులు ప్రారంభమయ్యాయి. ఎనిమిదేళ్ళ ఆలస్యం వల్ల దీని నిర్మాణ వ్యయం అసలు కన్నా మూడు రెట్లు పెరిగింది.ఈ ప్రాజెక్టు భవనాల నిర్మాణాన్నిప్రారంభించేందుకు 40 ప్రభుత్వ శాఖల అనుమతులు సంపాదించేవరకూ ఆగాల్సి వచ్చిందని ఈ ప్రాజెక్టు ఫైనాన్స్ డైరక్టర్ రాజేంద్రప్రసాద్ గోయల్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
అంతకుముందు 2003లోనే ప్రారంభం కావల్సిన ఈ ప్రాజెక్టు లిటిగేషన్ల వల్ల ,పొరుగు దేశాల నుంచి వచ్చిన అభ్యంతరాల వల్ల ఆలస్యం అయింది. చైనా సరిహద్దుల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఇంత ఆలస్యం జరగడ ం సహజమే. చైనా సరిహద్దుల్లో తన వైపున మౌలిక సదుపాయాల వృద్ధి పేరిట రోడ్లు,భవనాలనునిర్మిస్తోంది.దానికి అభ్యంతరం తెలిపినప్పుడు అవన్నీ తమ సరిహద్దుల్లోనే ఉన్నాయంటూ వాదిస్తోంది.అదే మన దేశం సరిహద్దుల్లో రహదారులు నిర్మిస్తే దురాక్రమణకు పాల్పడుతోంది. ఇందుకు తూర్పు లడక్ ప్రాంతంలో గాల్వాన్‌లోయలో నిర్మాణాల సమయంలో చైనా తెలిపిన అభ్యంతరాలే నిదర్శనం. నిజానికి గాల్వాన్ లోయ లో జరిగిన నిర్మాణాలన్నీ మన భూభాగంలో జరిగినవే.
కానీ,చైనా వీటిని దురాక్రమణలుగా పరిగణించడమే కాకుండా ప్రచారం చేసింది.గాల్వాన్‌లోయలో చైనా సైనికులు జరిపిన దాడిలో 23 మంది మన సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. చైనా వైపున కూడా సైనిక నష్టంజరిగింది.నష్టమేమీ జరగలేదని ముందు బుకాయించి తర్వాత చైనా అంగీకరించింది.అరుణాచల్ ప్రదేశ్‌లో తవాంగ్ ఆవలి వైపున చైనా శాశ్వత నిర్మాణాలను చేపట్టింది. ఇవన్నీ చైనా అక్రమంగా చేపట్టినవే.సరిహద్దుల్లో సైనిక సంచలనాన్ని పెంచిందీ,ఇప్పటికీ పెంచుతున్నదీ చైనాయే. అంతేకాక,ఈ ప్రాంతాల్లో నిర్మాణాల పరిశీలన కోసమని చెప్పి చైనా డ్రోన్లు నిరంతరం తిరుగుతున్నాయి. భారత్ సరిహద్దుప్రాంతాల్లో రహస్య సమాచారాన్ని సేక రించేందుకు ఈ డ్రోన్లను వినియోగిస్తోంది.
తాను తలపెట్టిన సరిహద్దు రోడ్డు ప్రాజెక్టు (మహామార్గం) ఆగిపోవడంతో చైనా మన దేశంపై గుర్రు పెంచుకుంది.నిజానికి ఈ ప్రాజెక్టు వల్ల తమ దేశానికి హాని జరుగుతోందని భూటాన్, నేపాల్, తదితర దేశాలు అభ్యంతరాలను వ్యక్తంచేశాయి.ఈప్రాజెక్టు వల్ల తమ దేశాల్లో కొంత భూభాగాన్ని చైనా ఆక్రమించుకోవడం వల్ల ఆదేశాలు అభ్యంతరాన్నివ్యక్తం చేశాయి. చైనా మన భూభాగాన్ని ఆక్రమించి అరవై ఏళ్ళు దాటింది.దానిని ఖాళీ చేయమని కోరినప్పుడల్లా ఏదో సాకుతో పేచీపెడుతూ వచ్చింది.దీని కోసం ఉన్నత స్థాయి అధికారుల కమిటీలను కూడా ఏర్పాటు చేశారు.అయినా ఈ కమిటీల సమావేశాలు మొక్కుబడిగా జరుగుతున్నాయేతప్ప సమస్య పరిష్కారం దిశగా సాగడం లేదు.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ చైనాతో కయ్యానికి దిగకుండా అతి సున్నితమైన సరిహద్దు సమస్యను జాగ్రత్తగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. విదేశాంగ మంత్రిగా జయ శంకర్‌ని నియమించడంలో ముఖ్యోద్దేశ్యం ఇదే.అదే రాజకీయ వేత్త ఈ పదవిలో ఉండి ఉంటే చాలా గొడవలు జరిగి ఉండేవి.జయశంకర్ మాజీ దౌత్యవేత్త,మోడీకి అత్యంత సన్నిహితుడు. అంతేకాక, దక్షిణాసియా, ఆగ్నేయాసియా సమస్యల పట్లసంపూర్ణమైనఅవగాహన కలిగినవారు. విదేశాంగ మంత్రిగా జయశంకర్ తీసుకునే నిర్ణయాలను మోడీ ప్రశ్నించడం లేదు.
అలాగే,ఆయన కూడా మోడీ మనసెరిగిన వ్యక్తిగా చైనా విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు.సరిహద్దుల్లో ఇటు చైనా,అటుపాకిస్తాన్లు రెండూ మన దేశంపైకి కాలు దువ్వుతున్నా, ఏమాత్రం తొందరపడకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు పూర్తి కావచ్చిన సుబాన్సిరి హైడ్రో విద్యుత్ప్రాజెక్టు నిర్మాణంలో చైనా పాత్ర,ప్రమేయం లేకపోయినా,ఈ ప్రాజెక్టులో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో వాటా ఇవ్వమని చైనా పేచి పెట్టినా ఆశ్చర్యం లేదు.సరిహద్దుల్లో జల విద్యుత్ ప్రాజెక్టుల లో ఉత్పత్తి అయ్యే విద్యుత్ కోసం చైనా ఇప్పటికే ఒత్తిడి చేస్తోంది.బ్రహ్మపుత్ర నదిలో వాటా ఎక్కువ భాగం తనకే దక్కుతుందంటూ వితండం చేస్తోంది.
ఈ నేపథ్యంలో సుబాన్సిరి ప్రాజెక్టు ఉత్పత్తి పూర్తిస్థాయిలోజరిగితే చైనా మన దేశంపై మరింతగా ఒత్తిడి తేవచ్చు. జలవిద్యుత్ ప్రాజెక్టులవల్ల స్వచ్ఛమైన ఇంధనం లభిస్తుంది.థర్మల్ విద్యుత్‌కీ,జలవిద్యుత్కీ తేడా అది.నేపాల్‌తో హైడ్రో విద్యుత్ విషయంలో భారత్ సంబంధాలపై చైనా పేచీ పెడుతోంది.అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమేననివాదిస్తున్న చైనా ఇప్పుడు ఈ కొత్త ప్రాజెక్టుపై వి వాదాన్ని సృష్టించే అవకాశం ఉంది.