Tuesday, November 26, 2024

అల్లుడికి సర్ ప్రైజ్ గిఫ్ట్‌ ఇచ్చిన నాగబాబు!

మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నీహారిక వివాహం జొన్నలగడ్డ చైతన్యతో గతేడాది డిసెంబర్ లో జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా తన అల్లుడికి నాగబాబు ఓ ఖరీదైన బహుమతిని ఇచ్చారు. ఇంతకీ ఈ బహుమతి ఏంటని అనుకుంటున్నారా? వైట్ కలర్ రేంజ్ రోవర్ కారు. దీని ఖరీదు రూ. 70 లక్షల వరకూ ఉంటుంది. వాస్తవానికి ఈ బహుమతి ఉగాది సందర్భంగా ఇవ్వాల్సి వుందని, కానీ కాస్తంత ఆలస్యం అయిందని నాగబాబు చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోను నాగబాబు సోషల్ మీడియాలో షేర్ చేశారు.  ప్రస్తుతం ఈ ఫోటో, వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారింది. 

కాగా, నిహారిక పెళ్లి జొన్నలగడ్డ చైతన్యతో గత డిసెంబర్‌‌ 9న అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌లో కుటుంబ సభ్యులు, కొద్దిమంది అతిథుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరిగింది. ప్రస్తుతం నిహారిక-చైతన్య తమ దాంపత్య జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు. భర్తతో గడిపిన ప్రత్యేక క్షణాలను నిహారిక ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకుంటోంది. 

https://youtu.be/Wpk4SjIO9HA
Advertisement

తాజా వార్తలు

Advertisement