ఉజ్బెకిస్థాన్‌లోని సమర్క్డ్లో సెప్టెంబర్ 15న ప్రారంభం కానున్న షాంఘై కో ఆపరేటివ్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ)సదస్సులో దాయాది దేశాల ప్రధానమంత్రులు నరేంద్రమోడీ, షెష్బాజ్ షరీఫ్‌లు ముఖాముఖి సమావేశం కానున్నారని దౌత్యవేత్తలు వెల్లడించినట్లు డెయిలీజంగ్ గురువారం ప్రకటించింది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో ప్రాంతీయసవాళ్లపై అధినేతలు చర్చించనున్నారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఎస్సీఓ సదస్సులో చైనా, రష్యా, ఇరాన్ దేశాధినేతలతో పాటు ఇండియా ప్రధాని నరేంద్రమోడీతో కూడా సమావేశం కానున్నారని అధికారిక వర్గాలు ప్రకటించాయి. జులై 28న జరిగిన ఎస్సీఓ విదేశాంగ మంత్రుల సమావేశంలో, ఎస్సీఓ దేశాధినేతలు సదస్సుకు హాజరవుతారని ప్రకటించడం జరిగింది.
అయితే, తాష్కెంట్లో జరిగిన ఎస్సీఓ విదేశాంగమంత్రుల సదస్సుకు హాజరైన పాకిస్థాన్ విదేశాంగమంత్రి బిల్వాల్ భుట్టో మాత్రం షెడ్యూల్లో ఇండియా, పాకిస్థాన్ ప్రధానమంత్రుల సమావేశం లేదని స్పష్టం చేశారు. ఇండియా, పాకిస్థాన్ ప్రధానుల మధ్య సెప్టెంబరులో సమావేశానికి సంబంధించి ప్రణాళికలు లేవని ఆయన ప్రకటించారు. ఎస్సీఓలో ఇండియా, పాకిస్థాన్‌లు సభ్య దేశాలు కనుక విస్త్రత స్థాయిలో ఆర్గనైనేజేషన్ కార్యకలాపాల్లో పాల్గొంటారని స్పష్టం చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.