Saturday, October 19, 2024

TG | మంత్రి తుమ్మ‌లతో కొత్త వీసీల భేటీ !

ప్రొఫెసర్ జయశంకర్ వర్సిటీ, కొండా లక్ష్మణ్ హార్టికల్చరల్ వర్సిటీల‌కు ఉపకులపతి(వైస్ ఛాన్సలర్)గా నియమితులైన డాక్టర్ అల్దాస్ జానయ్య, డాక్టర్ దండా రాజిరెడ్డి కలిశారు. రాష్ట్ర‌ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఆయ‌న క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు.

ఈ సందర్భముగా మంత్రివర్యులు వారిద్దరినీ శాలువాలతో సత్కరించి, వారి పదవీకాలంలో యూనివర్శిటీల అభివృద్ధికి, విద్యార్థుల ప్రగతికి, వ్యవసాయం, ఉద్యానవన రంగాల అభివృద్ధికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందన్నారు. శాస్త్రీయ పరిశోధనల ద్వారా వ్యవసాయ, ఉద్యానవన రంగాల్లో గుణాత్మక మార్పులు తీసుకొచ్చి రైతుల సంక్షేమానికి బాటలు వేసేందుకు కృషి చేయాలని వారిని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement