Friday, November 22, 2024

కేంద్ర మంత్రితో ఏపీ సర్పంచుల సమావేశం.. 2వ విడత నిధుల విడుదలకు విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: 15వ ఆర్ధిక సంఘం సిఫార్సు చేసిన రెండవ విడత నిధులు రూ. 581 కోట్లు దేశంలోని గ్రామ పంచాయితీలకు త్వరలో విడుదల చేస్తామని కేంద్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. గురువారం ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంక్షేమ సంఘం ప్రతినిధులు ఆయన్ను కలిసి నిధులు విడుదల చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని సర్పంచుల సంఘం ప్రతినిధులు వెల్లడించారు. కేంద్ర మంత్రితో సమావేశం అనంతరం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. గ్రామ పంచాయితీ ఖాతాల్లోనే నేరుగా కేంద్రం నిధులు బదిలీ చేయాలని కేంద్రమంత్రిని కోరినట్టుగా తెలిపారు.

కేంద్ర పంచాయితీ నిధులు గ్రామాల్లో ప్రజా సంక్షేమం కోసమే ఖర్చు చేస్తామని తెలిపారు. పంచాయతీల అభివృద్ధిపై కేంద్ర మంత్రి కీలక సూచనలు చేశారని వెల్లడించారు. గ్రామాల్లో పంచాయితీ విద్యుత్ బిల్లులు తగ్గించుకోవడం కోసం సౌర విద్యుత్తు వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని కేంద్రమంత్రి సూచించారని తెలిపారు. గ్రామాల్లో సెల్ ఫోన్ టవర్లకు పంచాయితీలు పన్నులు వసూలు చేయాలని కేంద్రమంత్రి సూచించినట్టు వెల్లడించారు. గ్రామ పంచాయితీకి ఆదాయం సమకూర్చుకోవలని కేంద్రమంత్రి సూచనలు చేశారు. గ్రామ సమస్యలు, యువత, కేంద్ర రాష్ట్ర పథకాలు, సంక్షేమ అంశాలపై సభలు పెట్టుకోవాలని కేంద్రమంత్రి సూచించినట్టు ఏపీ సర్పంచులు వెల్లడించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement