Thursday, November 21, 2024

అమెరికాలో ప్ర‌జాస్వామ్య స‌ద‌స్సు.. మోడీకి ఆహ్వానం

వ‌చ్చే నెల‌లో అమెరికాలో జ‌ర‌గ‌నున్న ఒక కీల‌క స‌మావేశానికి హాజ‌రు కావాల్సిందిగా ప్ర‌ధాని మోడీకి ఆహ్వానం అందింది. అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ నిర్వ‌హిస్తున్న స‌మావేశ‌మ‌ది. ప్ర‌జాస్వామ్యం కోసం స‌ద‌స్సు పేరిట ఆ స‌మావేశం నిర్వ‌హించ‌బోతున్నారు. అయితే ప్ర‌ధాని మోడీ అమెరికా వెళ్ల‌క‌పో్వ‌చ్చు.

వ‌ర్చువ‌ల్ స‌మావేశంలో పాల్గొన‌వ‌చ్చు. రెండు రోజుల పాటు స‌మావేశం ఉంటుంది. డిసెంబ‌రు 9,10 తేదీల్లో జ‌రిగే ఈ స‌ద‌స్సులో వివిధ దేశాధిప‌తులు, పౌర స‌మాజాలు, ప్ర‌యివేటు రంగ నిపుణులకు ఆహ్వానాలు పంపారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌జాస్వామ్యానికి ఎదుర‌వుతున్న క‌ష్ట‌న‌ష్టాల‌ను, స‌మ‌స్య‌ల‌ను, బెదిరింపుల‌ను స‌మ‌గ్రంగా చ‌ర్చించి, వాటికి నివార‌ణోపాయాల‌ను క‌నుగొని, ఒక నిశ్చిత ఎజెండాను త‌యారుచేయాల‌న్న సంక‌ల్పంతో జోబైడెన్ ఈ భారీ స‌మావేశాన్ని సంక‌ల్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement